Share News

World Veterinary Day: మూగజీవాలకు అసలైన నేస్తం

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:54 AM

ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా, పశువైద్యుల సేవలను గౌరవించడం మరియు పశువుల ఆరోగ్య సంరక్షణలో వారి పాత్రను గుర్తించడం జరుగుతోంది. దామోదర్‌నాయుడు హాజరయ్యే కార్యక్రమం మచిలీపట్నంలో నిర్వహించబడింది.

World Veterinary Day: మూగజీవాలకు అసలైన నేస్తం

పశువైద్యులకు గుర్తింపుగా నేడు ప్రపంచ పశువైద్య దినోత్సవం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పశుపాలకులకు మార్గదర్శకులుగా.. మూగజీవాల పాలిట ప్రాణదాతలుగా.. జీవవైవిధ్యంలో కీలక పాత్రపోషించే పశువైద్యుల సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! మానవాళికి ప్రత్యక్షంగానే ఉపయోగపడే పశువుల ఆరోగ్యానికి పశువైద్యులు, పశువైద్యశాస్త్రవేత్తలు అందిస్తున్న బహుళ సేవలను మననం చేసుకునేందుకు ఏటా ఏప్రిల్‌ నెలలో చివరి శనివారాన్ని ప్రపంచ పశువైద్య దినోత్సవంగా జరుపుతున్నారు. మచిలీపట్నంలో జరిగే కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు హాజరుకానున్నారు.

పశుసంపదకు వైద్యులే బలం!

రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయం. దీంతోపాటు పశుపోషణ వారి మనుగడలో కీలకమైనది. పాడితో రైతులకు, ఇతర గొర్రెలు, మేకలు, పందుల మాంసం, కోళ్ల నుంచి గుడ్లు, మాంసం ఉత్పత్తితో పెంపకందారులకు ఆదాయం లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడున్నర కోట్ల మూగజీవాలుండగా వీటికి పశువైద్య సిబ్బందే కొండంత అండగా నిలుస్తున్నారు. ఆసుపత్రుల్లో మందులు పంపిణీ చేయడంతో పాటు పశువుల పునరుత్పత్తికి కృత్రిమ గర్భధారణ, శస్త్రచికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, సంచార వాహనాల ద్వారా పశువులకు ఇంటి వద్దే అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. పశువుల నుంచి సోకే జూనోటిక్‌ వ్యాధుల నివారణలో పశుపోషకులు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. వ్యాధుల నిర్ధారణ, నివారణ, చికిత్స, అవగాహన, ప్రభుత్వ సహాయ పథకాలను పశుపోషకులకు అందిస్తూ, మూగ జీవాలను చీదరించుకోకుండా విశిష్ఠ సేవలు అందిస్తున్న పశువైద్యులను గౌరవించుకోవడం సముచితంగా ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 04:54 AM