Share News

Loan Harassment: ఆమెను చెట్టుకు కట్టేసి..

ABN , Publish Date - Jun 17 , 2025 | 03:36 AM

చేసిన అప్పు భర్త తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు....

 Loan Harassment: ఆమెను చెట్టుకు కట్టేసి..

  • అప్పు తీర్చాలంటూ వేధింపులు

  • భర్త తీసుకున్న రుణానికి భార్యకు శిక్ష

  • చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం

కుప్పం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): చేసిన అప్పు భర్త తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు. గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర సుమారు మూడేళ్ల క్రితం తిమ్మరాయప్ప రూ.80 వేలు అప్పు తీసుకుని తీర్చలేకపోయారు. ప్రస్తుతం భార్యాభర్తలద్దరూ బిడ్డలతో కలిసి బతకడానికి ఊరు వదిలి వెళ్లిపోయారు. అయితే తన కుమారుడి స్టడీ సర్టిఫికెట్‌ కోసం శిరీష సోమవారం గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న మునికృష్ణప్ప ఆమెపై దాడి చేశారు. శిరీషను చెట్టుకు తాడుతో బంధించారు. అప్పు తీర్చాలంటూ దాదాపు గంట సేపు వేధింపులకు గురిచేశాడు. స్థానికులు కొందరు సమాచారం అందించడంతో కుప్పం అర్బన్‌ పోలీసులు నారాయణపురం చేరుకుని శిరీషను విడిపించారు. మునికృష్ణప్పతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Jun 17 , 2025 | 03:38 AM