ఇనచార్జిల పాలనతోఇక్కట్లు..!
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:44 PM
మండలంలో పలు ప్రభుత్వ శాఖల్లో కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని తూతూ మంత్రంగా ఇనచార్జి లతో నింపే శారు.

ప్రభుత్వ శాఖల్లో కీలక స్థానాలు ఖాళీ
పెద్ద దిక్కు లేక గాడి తప్పుతున్న పాలన
జోడు పదవుల్లో తూతూమంత్రంగా బాధ్యతలు
అతిథి సేవలతో ప్రజలకు అవస్థలు
చాగలమర్రి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో పలు ప్రభుత్వ శాఖల్లో కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని తూతూ మంత్రంగా ఇనచార్జి లతో నింపే శారు. ఫలితంగా పాలన గాడి తప్పి ప్రజా సంబంధాలు, కార్యాలయ కలాపాలు అటకెక్కాయి. ఏ పనిముందుకు సాగాలన్న ఇనచార్జి అనే కారణంతో వాటిని పట్టించుకోవడం లేదు. బాధ్యతలు చేపట్టిన అధికారులు అతిథి పాత్ర పోషిస్తుండటంతో ఆయా శాఖల్లో పారదర్శక పాలన, పర్యవేక్షణ లోపించింది. అటు ఉద్యోగులు, ఇటు కార్యాలయానికి పలు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బదిలీలు ఇలా.. బాధ్యతలు అలా..!
చాగలమర్రి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీ డీవోగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్‌దౌల మహానందికి బదిలీపై వెళ్లారు. జిల్లా ఇనచార్జి డీపీవోగా విధులు నిర్వహిస్తున్న మంజులవాణి చాగలమర్రి ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. నెల రోజులు తిరగక ముందే ఆమె ఉమ్మడి జిల్లా కు బదిలీ అయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏవోగా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ ఇనచార్జి ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహి స్తున్నారు. విద్యుత కార్యాలయంలో ఏఈ షాజ హాన నంద్యాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సబ్ ఇంజనీర్ రమణయ్య ఇనచార్జి ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. చాగలమర్రి మేజర్ పంచాయతీ ఈవోగా పని చేస్తున్న సుదర్శన గుండెపోటుతో మృతి చెందాడు. ఈవో, ఈవోఆర్డీ రెండు శాఖల బాధ్యతలను ఆళ్లగడ్డ నుంచి వచ్చిన ఈవోఆర్డీ తాహిర్‌హుసేన విధులు నిర్వహిస్తున్నారు. రెండే ళ్ల నుంచి ఇనచార్జిలతోనే కొనసాగిస్తున్నారు. మే జర్ పంచాయతీ మేస్త్రీ శివారెడ్డి రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. పంచాయతీ కార్యాల యంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న ఓ వ్యక్తిచే మేస్త్రీ బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ మేస్త్రీ లేకపోవడంతో పారిశుధ్య కార్మికులు, ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. చాగలమర్రి పో లీసు స్టేషనలో రెగ్యులర్ ఎస్‌ఐ లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ రమణయ్య సంజామల పోలీసు స్టేషనకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా ఎస్‌ఐ రమేష్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కొన్ని నెలల విధుల అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు 40 రోజుల క్రితం చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి రెగ్యులర్ ఎస్‌ఐ లేకపోవడంతో ఆళ్లగడ్డ రూరల్ ఎస్‌ఐ హరిప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోలీసు స్టేష్‌లో రెగ్యులర్ ఎస్‌ఐ లేకపోవడంతో కింది స్థాయి పోలీసు సిబ్బంది ఇబ్బంది పడుతు న్నారు. రెండు శాఖల పనిభారంతో ఇనచార్జి ఎస్‌ఐ కూడా విధులు నిర్వహించేందుకు ఇబ్బం దిగా మారింది. కీలక పదవుల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి రెగ్యులర్ అధికారులను నియమించి పాలన సక్రమంగా కొనసాగేలా చూడాల ప్రజలు కోరుతున్నారు.