సంచార జాతులకు అండగా ఉంటాం : ఘంటా పద్మశ్రీ
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:18 AM
సంచారులు గౌరవంగా బతికేలా చేస్తామని వారికి అండగా నిలుస్తామని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ వరప్రసాద్ అన్నారు.
ఏలూరు రూరల్, ఆగస్టు 31, (ఆంధ్రజ్యోతి) : సంచారులు గౌరవంగా బతికేలా చేస్తామని వారికి అండగా నిలుస్తామని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ వరప్రసాద్ అన్నారు. గిరిజన సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షుడు అన్నపరెడ్డి మురళి అధ్యక్షతన ఆదివారం స్థానిక లేడీస్ క్లబ్‌లో సంచార జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ సంచారులు విద్యపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. సంఘం అధ్యక్షు డు అన్నపురెడ్డి మురళి మాట్లాడుతూ సంచార తెగల విద్యార్థులకు ప్రత్యేక గురుకుల పాఠశాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. వడ్డీ కార్పొరేషన్ ఛైర్మన్ ఘంటశాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కుల గణన చేసే సమ యంలో సంచార జాతులు తెగులు, వారి వివరాలు నమోదు చేయించుకోవాలని ముఖ్యంగా ఆధార్‌కార్డు పొందాలన్నారు. అనంతరం డాక్టర్ లంక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంచారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. తాడిశెట్టి గోపి, లక్కోజు గోపి, ఉక్కుసూరి గోపాలకృష్ణ, జావీదు, వరలక్ష్మి, జి.సుధాకర్, ఎం.గురవయ్య, కత్తుల మణి, ఎస్‌వీ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.