మీ భూమి కనిపించడం లేదు
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:09 AM
‘రీ సర్వేతో రైతుకు భద్రత పెరుగుతుంది. ఎల్పీ నెంబర్లు కేటాయించిన భూములకు ఆక్రమణలు, అక్రమ రిజిస్ర్టేషన్ల కు తావుండదు.
మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయని తొలగించిన రెవెన్యూ అధికారులు
రికార్డులు లేవంటున్న మున్సిపాలిటీ
డ్రోన్‌లు తిప్పేసి హడావుడిగా సర్వే
ఆరేళ్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు
తాడేపల్లిగూడెంలో కనిపించని పరిష్కారం
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
‘రీ సర్వేతో రైతుకు భద్రత పెరుగుతుంది. ఎల్పీ నెంబర్లు కేటాయించిన భూములకు ఆక్రమణలు, అక్రమ రిజిస్ర్టేషన్ల కు తావుండదు. భవిష్యత్తులో భూముల రిజిస్ర్టేషన్‌లు ఈ విధంగా జరుగుతాయి’ అని నాటి వైసీపీ ప్రభుత్వం చెప్పడంతో అంతా సంతోషించారు. కాని, అదే రీ సర్వే రైతులకు అన్యాయం చేస్తుందని ఏ ఒక్కరూ ఊహించ లేదు. హడావుడిగా చేపట్టిన రీ సర్వే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1100 ఎకరాలకు చెందిన రైతులు తీరని అన్యాయం చేసింది. పట్టణ పరిధిలోని జువ్వలపాలెం, పెంటపాడు మండలంలోని దర్శిపర్రు రెవెన్యూ భూములు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించలేదు. వెబ్‌ల్యాండ్‌లో భూ ముల వివరాలు కనిపించడంలే దు. ఐదేళ్లుగా రైతులు ఇబ్బందు లు పడుతున్నారు. అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ప్రభు త్వం దృష్టికి సమస్య వెళ్లినా పరిష్కారం కాలేదు.
ఎందుకిలా..
తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు దర్శిపర్రు పరిధి లోని 1,100 ఎకరాల రెవెన్యూ భూములు దీనిలో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. రెవెన్యూ రికార్డులు దర్శిపర్రులోనే ఉన్నాయి. భూమి పన్నులు పెంటపాడు మండల రెవెన్యూ శాఖకే చెల్లిస్తున్నారు. అవే భూముల్లో లే అవుట్‌లు వెలిస్తే మాత్రం తమ పరిధిలోకి వస్తాయంటూ మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటోంది. ప్లాన్‌లు దీని పరిధి లోకి వస్తున్నాయి. ఇక్కడ అధికంగా రుసుము చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో దర్శిపర్రు పంచాయతీలో ప్లాన్‌లు తీసుకుంటున్న వారు ఉన్నారు. పెంటపాడు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌లు చేసుకుంటున్నారు. ఇలా రైతులు తమ భూములను దర్శిపర్రు పరిధిలో ఉన్నాయం టూ భరోసాతో ఉండేవారు. వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే తర్వాత రైతుల తలరాత తల్లకిందులైంది. తమ వద్ద రికా ర్డులున్నా దర్శిపర్రు రెవెన్యూ నుంచి 1100 ఎకరాల భూమి ని తొలగించారు. అలాగని మున్సిపాలిటీ రెవెన్యూ పరిధి లోకి వ్యవసాయ భూములు తీసుకురాలేదు. అదే జరిగి ఉంటే తాడేపల్లిగూడెం రెవెన్యూ శాఖ సర్వే నిర్వహించి భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసేది.
డ్రోన్‌పై నెపం
డ్రోన్ తిరగకపోవడంతో సర్వే చేయలేకపోయామని పెంటపాడు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులన్నీ దర్శిపర్రు రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. పెంట పాడు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను నిర్వహిస్తూ వచ్చారు. సర్వే చేయలేదు. అవే భూముల్లో మున్సిపాలిటీ డ్రోన్ తిప్పింది. కాని, వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయలేదు. పెంటపాడు మండల రెవెన్యూ సిబ్బంది డ్రోన్ తిప్పకపోవ డంతో దర్శిపర్రు, జువ్వలపాలెం భూములను సదరు మం డలం నుంచి తొలగించారు. మున్సిపాలిటీ అప్పట్లో డ్రోన్ తి ప్పింది. మున్సిపాలిటీలో సర్వే పూర్తిచేశారు. వెబ్ ల్యాండ్ లో నమోదు చేయలేదు. ఎల్పీ నెంబర్‌లు కేటాయించలేదు.
గతంలో దర్శిపర్రు రెవెన్యూ అధికారులే పన్ను వసూలు చేశారు. రీ సర్వే ముందుకొచ్చిన తర్వాత పన్ను వసూళ్లను నిలిపివేశారు. అప్పటి నుంచి రైతులు పన్ను చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. రాష్ట్ర భూపరిపాలన శాఖ కమిషనర్ స్థాయిలో సమస్య పరిష్కారం కావాలి. అక్కడ చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా కలెక్టర్‌పైనే భారం మోపుతున్నారు.
పథకాలకు నోచుకోని రైతులు
రైతుమిత్ర పథకానికి 1100 ఎకరాలకు చెందిన రైతులు నోచుకోవడం లేదు. పన్ను వసూలు చేయకపోవడంతో సంక్షేమ పథకాలకు రైతులు దూరమయ్యారు. రైతుమిత్రలో ప్రభుత్వం
ప్రతి రైతుకు రూ.20 వేలు చెల్లిస్తోంది. మొదటి విడతగా రూ.7 వేలు జమ చేసింది. జువ్వలపాలెం, దర్శిపర్రు రైతులు ఈ పథకానికి నోచుకోలేదు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నారు. క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. పిల్లల వివాహాలకు జువ్వలపాలెం, దర్శిపర్రు రైతులు భూమి కానుకగా ఇవ్వలేకపోతున్నారు. రిజిస్ర్టేషన్‌లు చేసుకోలేకపో తున్నారు. భూవినియోగ మార్పిడి చేసుకోవాలన్నా అవకాశం లేదు. ఇళ్లు కట్టుకుందామన్నా ఇబ్బందికరంగా మారింది. సమస్య పరిష్కరించాల్సిన అధికారులు నోరెళ్ల బెడుతున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్ రావాలని చెప్పుకొస్తున్నారు. భూములను రికార్డుల నుంచి తొలగించే ముందు ఇదంతా ఆలోచించాలి. రీ సర్వేను అక్కడ నిలుపుదల చేయాలి. కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చేంత వరకు ఎల్పీ నెంబర్‌లతో కాకుండా ఇప్పుడున్న సర్వే నెంబర్‌లతో కార్యకలాపాలు నిర్వహించాలి. ఆ దిశగానూ అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. సమస్యను సృష్టించారు. పరిష్కరించడంలో మాత్రం విఫలమ వుతున్నారు. భూమిని వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించడానికి మళ్లీ కొత్త సాఫ్ట్‌వేర్ రావాలని చెపుతున్నారు. అప్పటి వరకు రైతుల పరిస్థితి ఏమిటో అధికారులకే తెలియాలి.