గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో యోగాంధ్ర
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:02 AM
యోగా ఆసనాలను ప్రతీ ఒక్కరూ తమ జీవనశైలిగా మార్చుకోవాలని జేసీ ఽధాత్రిరెడ్డి అన్నారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మంగళ వారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిం చారు. జేసీతో పాటు ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు.
జంగారెడ్డిగూడెం, జూన్ 10(ఆంధ్ర జ్యోతి):యోగా ఆసనాలను ప్రతీ ఒక్కరూ తమ జీవనశైలిగా మార్చుకోవాలని జేసీ ఽధాత్రిరెడ్డి అన్నారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మంగళ వారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిం చారు. జేసీతో పాటు ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జేసీ మాట్లాడుతూ ఆధ్యాతిక్మక, పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర నిర్వహించడంతో అంతర్జాతీయ గుర్తింపుతో పాటు మంచి స్ఫూర్తి కలుగుతుందన్నారు. ఈ నెల 18న కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యోగాస నాలపై అవగాహన కార్యక్రమంలో ప్రజలం తా పాల్గొనాలని కోరారు. ఎస్పీ మాట్లాడు తూ ప్రతీ మనిషి జీవితానికి అమ్మ తోడు ఎంత అవసరమో దేశానికి యోగాసనాలు అంతే ముఖ్యమన్నారు. ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్, ఆర్డీవో ఎంవి.రమణ, తహసీల్దార్ కె.స్లీవజోజి, డీఎస్పీ యు.రవి చంద్ర, కమిషనర్ కెవి.రమణ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ,టీడీపీ పట్టణ,మండల అధ్య క్షులు కొండ్రెడ్డి కిషోర్,సాయిల సత్యనారా యణ, నాయకులు రావూరి కృష్ణ,పెనుమర్తి రామకుమార్,రాజాన పండు తదితరులు పాల్గొన్నారు.
7,91,485 మంది పేర్లు నమోదు
ఏలూరుసిటీ : యోగాంధ్ర కార్య క్ర మంలో ఇంతవరకు 7,91,485 మంది పేర్లు నమోదు చేసుకున్నారని జేసీ ధాత్రిరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ మంగళవారం తన ఛాంబర్‌లో ఈనెల 13న సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఐదువేల మంది విద్యార్థులతో నిర్వహించే యోగాంధ్ర కార్య క్రమ ఏర్పాట్లపై విద్యా, ఆయుష్, నగర పాలక సంస్థ రెవెన్యూ సంబంధిత శాఖలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఆర్వో విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈవో భీమే శ్వర్ తదితరులు పాల్గొన్నారు.