యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి
ABN , Publish Date - May 22 , 2025 | 12:25 AM
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, ఇది వారి మెరుగైన జీవనానికి దోహదం చేస్తుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. వట్లూరులోని టెక్నికల్ ట్రైనింగ్ అభివృద్ధి సంస్థ (టీటీడీసీ)లో జిల్లాస్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో కలిసి బుధ వారం ప్రారంభించారు.
కలెక్టర్ వెట్రిసెల్వి..టీటీడీసీలో యోగా ఓరియంటేషన్
పెదపాడు/ఏలూరు, మే 21 (ఆంధ్రజ్యోతి) : యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, ఇది వారి మెరుగైన జీవనానికి దోహదం చేస్తుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. వట్లూరులోని టెక్నికల్ ట్రైనింగ్ అభివృద్ధి సంస్థ (టీటీడీసీ)లో జిల్లాస్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో కలిసి బుధ వారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు నెలరోజుల పాటు యోగా మాసంగా పాటించి, జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తామన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా మంచి సాధనమన్నారు. జేసీ ధాత్రిరెడ్డి మాట్లా డుతూ యోగా ప్రాముఖ్యతను విస్తృతం చేసేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యోగాంధ్రపై రూపొందించిన యాప్‌ను ఆవిష్కరించి, వేముల ధర్మారావు ఆధ్వర్యంలో యోగా శిక్షణ నిర్వహిం చారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో అచ్యుత్ అంబరీశ్, ఆయుష్ ఆర్జేడీ లక్ష్మి సుభద్ర, డీఆర్డీఏ పీడీ విజయరాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహిస్తున్నందున యోగాంధ్ర–2025పై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. యోగాంఽధ్రపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వెట్రిసెల్వి, జేసీ ధాత్రిరెడ్డి హాజర య్యారు. అనంతరం జిల్లా అధికారులతో వీరిద్దరూ సమీక్షించారు.