యోగాంధ్రకు సిద్ధం
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:48 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో శనివారం నిర్వహించే యోగాంధ్ర కార్యక్ర మానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
భీమవరం టౌన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో శనివారం నిర్వహించే యోగాంధ్ర కార్యక్ర మానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. 5 వేల మంది యోగాసనాలు వేయడానికి అనువైన ఏర్పాట్లను శుక్రవారం రాత్రి ఆమె పరిశీలించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు యోగా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు
జిల్లావ్యాప్తంగా శనివారం యోగా కార్యక్రమాలు విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. శుక్రవారం కలెక్టర్ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో నమోదైన 8.80 లక్షల మంది యోగా కార్యక్రమాలలో పాల్గొనేవిధంగా చూడాలన్నారు. యోగా కార్యక్రమాలు, శిక్షణకు హాజరైన వారికి సర్టిఫి కెట్ల జారీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిం చాలన్నారు.సమావేశంలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి బి.ఉమామహేశ్వరరావు, డీఈవో ఇ.నారాయణ, తదితరులు పాల్గొన్నారు.