వైసీపీకి షాక్
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:20 AM
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ కి ఎదురుదెబ్బ తగిలింది. పెంటపాడు ఎంపీ పీ దాసరి హైమావతిపై టీడీపీ, జనసేనతో పాటు వైసీపీకి చెందిన ఓ సభ్యుడు కలిపి మొత్తం 14 మంది ఎంపీటీసీ సభ్యులు అవి శ్వాస తీర్మానంపై సంతకాలు చేసి ఆర్డీవోకు నోటీసు అందజేశారు.
పెంటపాడు ఎంపీపీపై అవిశ్వాసం
పావులు కదిపిన జనసేన.. టీడీపీ సంఘీభావం
ఆర్డీవోకు 14 మంది ఎంపీటీసీలు నోటీసు.. నెల రోజుల్లో ఎన్నిక
(భీమవరం/పెంటపాడు–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ కి ఎదురుదెబ్బ తగిలింది. పెంటపాడు ఎంపీ పీ దాసరి హైమావతిపై టీడీపీ, జనసేనతో పాటు వైసీపీకి చెందిన ఓ సభ్యుడు కలిపి మొత్తం 14 మంది ఎంపీటీసీ సభ్యులు అవి శ్వాస తీర్మానంపై సంతకాలు చేసి ఆర్డీవోకు నోటీసు అందజేశారు. 19 ఎంపీటీసీ స్థానాల కు గాను గత ఎన్నికల్లో వైసీపీ తరపున 15 మంది, టీడీపీ తరపున ఇద్దరు, జనసేన మేండేట్‌పై ఇద్దరు విజయం సాధించారు. వీరిలో రావిపాడుకు చెందిన జనసేన అభ్యర్థి ఎన్నికల ముందే వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపి.. ప్రచారం కూడా చేశారు. నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం లేకపోవడంతో వైసీపీలో చేరినప్ప టికి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉండడంతో అక్కడి ఓటర్లు జనసేనపై అభిమానంతో గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి మరీ గెలి పించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆయన జనసేన తరపున నెగ్గినప్పటికి వైసీపీలోనే కొనసాగారు.
ఎంపీపీ పదవి ఆశలు కల్పిస్తూ..
బీసీ జనరల్ కేటగిరికి రిజర్వు అయిన ఎంపీపీ పదవిని ఆశించిన బండారు నాగుకు వైసీపీ షాక్ ఇచ్చి దాసరి హైమావతిని అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఎంపిక చేశారు. గతంలోనూ ఒక పర్యాయం ఎంపీపీగా కొనసాగిన ఆమెకు మళ్లీ అవకాశం ఇవ్వడంతో పార్టీలో అసంతృప్తి నెలకొంది. మరోవైపు దాసరి హైమావతికి రెండేళ్లు, పెంటపాడు ఎంపీటీసీ రెడ్డి సూరి బాబుకు, జట్లపాలెం ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మిలకు చెరో ఏడాదిన్నర ఎంపీపీగా ఉండేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచా రం. అయినప్పటికి ఇది అమలు కాలేదు. నాలుగేళ్లుగా హైమావతే ఎంపీపీగా కొన సాగుతున్నారు.
పట్టు బిగించిన జనసేన
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఘోర ఓటమి ఇది ఓ కారణంగా చెబుతారు. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికైన బొలిశెట్టి శ్రీనివాస్ ఎంపీపీ పీఠంపై దృష్టి సారించారు. తొమ్మిది మంది వైసీపీ సభ్యుల తోపాటు జనసేన మేండేట్‌పై గెలిచిన రావి పాడు ఎంపీటీసీ సభ్యుడు కూడా జనసేనలో చేరారు. దీంతో జనసేన బలం 11కు చేరింది. దీనితోపాటు తెలుగుదేశం సభ్యులు ఇద్దరు, కోరుమిల్లికి చెందిన వైసీపీ ఎంపీటీసీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. ఉద్యోగం నిమిత్తం వైసీపీ సభ్యుడు ఒకరు రాజీనామా చేశారు. దీంతో ఎంపీపీకి వ్యతిరేకంగా 14 మంది, అనుకూలంగా నలుగురు సభ్యులు నిలిచారు. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెడతారని ముందే అంతా ఊహించారు. నెల క్రితం జనసేన, టీడీపీ సభ్యులు సమావేశమై ఏకగ్రీ వంగా నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్లు పూర్తయితేనే ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వేచిచూశారు. గురువారం 14 మంది సభ్యులు ఆర్డీవో ఖతీబ్‌ఖౌసర్‌బనో, ఇన్‌చార్జి ఎంపీడీవో టీవీ సత్యనారాయణ, జడ్పీ సీఈవో, డీడీవోలకు నోటీసులు అందజేశారు. పుల్లా బాబి, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, బండి పెద్దిరాజు, దాసరి శ్రీనివాస్, కసిరెడ్డి మధులత, మైలవరపు పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీవో నెల రోజుల్లో ఎన్నిక నిర్వహిం చాలి. నూతన ఎంపీపీగా కట్టుబోయిన వెంకటలక్ష్మికి అవకాశాలు ఉన్నాయి.