వైభవంగా ముగిసిన సాహితీ సంబరాలు
ABN , Publish Date - May 12 , 2025 | 12:37 AM
అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఏలూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి.
ఏలూరు రూరల్, మే 11 (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఏలూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, సదస్సులు, నాటికలు, ఏకపాత్రాభినయాలు, మ్యూజిక్, కూచిపూడి, భరత నాట్యం, తదితర ప్రదర్శనలతో పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన కవులు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక మాట్లాడుతూ ఇటువంటి బృహత్తర కార్యక్రమం వల్ల తెలుగు భాష పరిఢవిల్లుతుందన్నారు. విశిష్ట అతిథి ఏపీ ఎన్‌ఆర్టీ మాజీ డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్, టీడీపీ మీడియా ప్రతినిధి బోళ్ల సతీష్‌బాబు మాట్లాడుతూ ఇటువంటి రికార్డు కార్యక్రమాలు చేయడం శ్రీశ్రీ కళావేదికకే సాధ్యం అన్నారు. కళావేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేస్తోన్న సాహితీ సేవలను కొనియాడారు. ప్రోగ్రామ్ కన్వీనర్, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, చిట్టే లలిత, డెబా విజయ్‌కుమార్, రాజేంద్ర, సతీష్, కరుణాకర్, నల్లా భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, వాసుదేవ్, తదితరులు పాల్గొన్నారు.