పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:18 AM
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలు పని ఒత్తిడి తగ్గించాలంటూ కాళ్ళ ఎంపీడీవో జి.స్వాతికి బుధవారం కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు.

ఎంపీడీవోలకు వినతిపత్రం ఇచ్చిన కార్యదర్శులు
కాళ్ళ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలు పని ఒత్తిడి తగ్గించాలంటూ కాళ్ళ ఎంపీడీవో జి.స్వాతికి బుధవారం కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ స్థాయిలో వ్యవహారాలను చూసుకుంటూనే, సచివాలయాల సిబ్బంది చేయాల్సిన పనులను కూడా ఒకే సమయంలో పర్యవేక్షణ చేయాల్సి రావడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు డి.సత్యనారాయణ, మండల అధ్యక్షుడు డి.సునీల్‌రాజు, బి.సతీష్ కుమార్, ఎస్.వెంకటేష్, టి.బాలకృష్ణ మోహన్, ఏ.పోలయ్య, అరుణారెడ్డి, సుజాత, శ్రీనివాస్ తదితర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గణపవరం: గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న అధిక పనిభారం, పని ఒత్తిడి తగ్గించాలని ఎంపీడీవో బేబి శ్రీలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. డి.శివరామ్‌ప్రసాద్, డీ.రామాంజనేయులు, మోహన్, రామకృష్ణుడు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
పాలకోడేరు: తరచు సర్వేలు, యాప్‌లు, నివేదికలు, సమీక్షలతో తీవ్ర పనిభారం, ఒత్తిడికి గురవుతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఎంపిడివో వి.రెడ్డియ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యదర్శులు కె.కృష్ణమోహన్, బంగారు గోపి, బాలకృష్ణ, లక్ష్మీప్రశాంతి, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉండి: పని ఒత్తిడి, సమస్యలతో సతమతం అవుతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఈవోపీఆర్‌డీ రెడ్డికి వినతిపత్రం అందించారు. కె.గోపాలకృష్ణ, జేవీటీ.నాయుడు, కిశోర్, అప్పారావు తదితరులున్నారు.