Share News

గ్రామాన్ని ఖాళీ చేయం..

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:05 AM

‘తాతల కాలం నుంచి ఇక్కడే జీవ నం సాగిస్తున్నాం.. గ్రామాన్ని ఉన్నపళంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే మేమంతా ఎక్క డకు వెళ్లాలి. సదుపాయాలు కల్పించమని మేం కోరుతుంటే అధికారులు మాత్రం సమావేశాలు, సభలు పెడుతూ గ్రామాన్ని ఖాళీ చేయాలనడం ఎంతవరకు సమం జసం.

గ్రామాన్ని ఖాళీ చేయం..
దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మోదేలు కొండరెడ్డి గ్రామం

నేడు జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌ పర్యటన

బుట్టాయగూడెం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘తాతల కాలం నుంచి ఇక్కడే జీవ నం సాగిస్తున్నాం.. గ్రామాన్ని ఉన్నపళంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే మేమంతా ఎక్క డకు వెళ్లాలి. సదుపాయాలు కల్పించమని మేం కోరుతుంటే అధికారులు మాత్రం సమావేశాలు, సభలు పెడుతూ గ్రామాన్ని ఖాళీ చేయాలనడం ఎంతవరకు సమం జసం. ఎంతటి పోరాటానికైన సిద్ధమేగాని గ్రామా న్ని మాత్రం ఖాళీ చేయం’ అంటూ మోదేలు గ్రామ కొండరెడ్లు స్పష్టం చేస్తున్నా రు. ఇదే విషయాన్ని ఇటీవల గ్రామానికి వెళ్లిన అధికారులకు తేల్చి చెప్పారు. ఈక్రమం లోనే సోమవారం మోదేలులో పర్యటించనున్న జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు వారంతా సన్నద్ధమవుతు న్నారు. అసలు విషయమేమింటే..

బుట్టాయగూడెం–వేలేరుపాడు మండలాల సరిహద్దున దట్టమైన అటవీ ప్రాంతంలో మోదే లు గ్రామం ఉంది. 29 కుటుంబాలు ఉండగా సుమారు 60 మంది జనాభా ఉన్నారు. పూర్వీకుల నుంచి ఇక్కడి కొండరెడ్లు పోడు వ్యవసా యం, అటవీ ఫలసాయాలపైనే ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి చిన్న అవసరానికి మైళ్ల కొలది నడిచి అడవి దాటి బయటకు రావాల్సిందే. ఇప్పటి వరకు గ్రామానికి ఎటువంటి మౌలిక సదు పాయాలు లేవు. రోడ్డు, విద్యుత్‌, మంచినీరు, పక్కాఇళ్లు లేవు. అడవిలో దొరికే గడ్డి, తాటాకులతో నిర్మించుకున్న గుడిసె ల్లోనే ఉంటున్నారు.

మౌలిక సదుపాయాలు కరువు

గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరు తున్నా చాలాకాలం అధికారులు పట్టించుకోలేదు. ముఖ్య మంత్రి, రాష్ట్రపతికి అనేకమార్లు అర్జీలు పెట్టుకున్నారు. అయితే మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అంటూ అధికారులు కస్సుబుస్సుమన్న ఘటనలు చాలానే ఉన్నాయి. కొండరెడ్డి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టి గతంలో నిధులు విడుదల చేశాయి. దీనిలో భాగంగా మోదేలుకు రోడ్డు, విద్యుత్‌, మంచినీటి సదుపాయం, ఇళ్లు మంజూర య్యాయి. తామంతా కష్టాల నుంచి గట్టెక్కుతున్నామన్న ఆశతో ఉన్న వారికి చేదు అనుభవం ఎదురయ్యింది. రిజ ర్వు ఫారెస్టులో ఎటువంటి అభివృద్ధి పనులు చేయడానికి వీలు లేదంటూ అటవీశాఖ అడ్డుపుల్ల వేసింది. పనులు చేసేందుకు అనుమతులను నిరాకరించింది. అధికారులు అనేక పర్యాయాలు సమావేశాలు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో కొండరెడ్లను గ్రామాన్ని ఖాళీ చేయించి కొండల నుంచి దిగువన మైదాన ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను అధికారులు చేపట్టారు. గ్రామాన్ని ఖాళీ చేసి కిందకు వస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అయితే పోడు భూములను ఇవ్వలేమని చెప్పడంతో కొండరెడ్లు ఎదురుతిరిగారు. పోడుభూములు లేకుంటే ఎలా బతకాలని అధికారులను నిలదీస్తున్నారు. అందుకే గ్రామాన్ని ఎటి ్టపరిస్థితుల్లోను ఖాళీ చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమకు మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వాలతో మాట్లాడాలని ఎస్టీ కమిషన్‌ సభ్యుడిని కోరనున్నారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి

కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు

కొండరెడ్లు కోరుతున్నట్లు గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. గతంలో గ్రామానికి చెందిన ఆరుగురు కొండరెడ్లకు పోడు భూములకు సంబంధించి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ లో పట్టాలు ఇచ్చారు. మిగిలినవారికీ పట్టాలు ఇవ్వాలి. అటవీశాఖతో మాట్లాడి అనుమతులు తీసుకుని సదుపాయాలకు శ్రీకారం చుట్టాలి.

వేరేచోట బతకలేం

తాతల కాలం నుంచి ఉంటున్న గ్రామాన్ని ఖాళీ చేయమంటే బాధగా ఉంది. అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మేము వేరేచోట బతకలేము. సదుపాయాలు కల్పించమంటే గ్రామాన్ని ఖాళీ చేయమనడం ఎంతవరకు సమంజసం. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే గ్రామానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి.

– కచ్చెల ముక్కారెడ్డి, మోదేలు

ఖాళీ చేయమనడం తగదు

అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకుని గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిం చాలే తప్పా ఖాళీ చేయమనడం భావ్యం కాదు. వేరేచోట అన్ని సదుపాయాలతో కాలనీ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నా నిర్వాసితుల అవస్థలను కళ్ళారా చూస్తున్నాం. వేరే ప్రాంతంలో కాలనీతోపాటు పోడు భూములను కూడా ఇస్తే ఆలోచన చేస్తాం. లేకుంటే ఇక్కడ నుంచి కదలం.

– గురుగుంట్ల ఎర్రపురెడ్డి, మోదేలు

నేడు, రేపు ఎస్టీ కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌ పర్యటన

ఏలూరు,అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): జాతీయ షెడ్యూల్‌ తెగల కమిషన్‌ సభ్యులు జాటోతు హుస్సేన్‌ జిల్లాలో 6,7 తేదీల్లో పర్యటిం చనున్నారు. ఆయన సోమవారం రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గం లో వేలేరుపాడు– బుట్టాయగూడెం సరిహ ద్దులోని మోదేలు గ్రామానికి చేరుకుంటా రు. 11.30 గంటలకు స్థానిక ఎస్టీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకు రామన్నగూడెం మీదుగా లంక పాకల ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి కోటరామ చంద్రా పురం చేరుకుని అధికారులతో సమీక్షిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి కోటరామ చంద్రాపురంలో పునరావాస కార్యక్రమాల ప్రణాళిక అంశంపై అధికారులతో సమావే శమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు కలెక ్టరేట్‌లో వివిధ శాఖల అధికారుల సమావేశంలో పాల్గొం టారు. అనంతరం కోటరామచంద్రాపురం చేరుకుని అక్కడ్నుంచి రాజమహేంద్రవరానికి బయ ల్దేరి వెళతారు.

Updated Date - Oct 06 , 2025 | 12:05 AM