నిరసన
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:39 AM
రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి చానల్ యాంకర్, విశ్లేషకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై మహిళల నిరసన కొనసాగుతోంది.
అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు దారుణం
సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలి
పత్రిక, చానల్‌ను నిషేధించాలి
మహిళల్లో పెల్లుబికిన ఆగ్రహం
పత్రిక ప్రతులు దహనం
రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి చానల్ యాంకర్, విశ్లేషకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై మహిళల నిరసన కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మూడో రోజు మంగళవారం పలుచోట్ల ఆందోళనలు చేపట్టి పత్రిక ప్రతులు దహనం చేశారు. సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలను మహిళలు డిమాండ్ చేశారు. సాక్షి మీడియాను నిషేధించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్ల జెండాతో మానవహారం
పాలకొల్లు అర్బన్/పాలకొల్లు టౌన్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేయడంతో పాటు రాష్ట్రంలో మహి ళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్న సాక్షి యాజమాన్యం తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మహిళలు, జనసేన, బీజేపీ మహిళా నాయకులు గాంధీ బొమ్మల సెంటర్‌లో మంగళవారం ఆందోళన చేపట్టారు. నల్ల బెలూన్లు, 100 మీటర్ల నల్ల జెండాతో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. సాక్షి యాంకర్, విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణం రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పత్రిక, చానల్ యాజమాన్యం జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్, పత్రికను నిషేధించాలని పెద్ద పెట్టున నినాదాలు ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు దబ్బా ఎస్తేరు రాణి, ప్రధాన కార్యదర్శి పెండ్యాల భవాని, విజయలక్ష్మి, పులి మాధురి, ఎ.లక్ష్మీజ్యోతి, ఎం.మహాలక్ష్మి, రెల్లి రమాదేవి, కాసాని శశిరేఖ, పో తుల మంగాదేవి, ద్రాక్షారపు జ్యోతి, తాళ్లూరి విజయ లక్ష్మి, కౌరు నాగలక్ష్మి, కొండేటి లక్ష్మీ కనకదుర్గ, తదిత రులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామో హన్, పెచ్చెట్టి బాబు, జీవి, గొట్టుముక్కల సూర్యనారా యణరాజు, తమ్మినీడి సత్యనారాయణరావు పీతల శ్రీనివాస్, సలాది రాము, గాదె వెంకన్న, కేశవ, ఎ దుర్గారావు, ఎం రాంప్రసాద్ సంఘీభావం తెలిపారు.
అసభ్యకర వాఖ్యలు హేయం
తాడేపల్లిగూడెం అర్బన్: అమరావతి మహిళలపై అసభ్యకరమైన వాఖ్యలు చేయడం హేయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, భవన, కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జి అన్నారు. సాక్షి చానల్ లో మహిళలపై అసభ్యకర వాఖ్యలకు నిరసనగా కూ టమి నాయకులు, కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తాలూకా సెంటర్ నుంచి పట్టణంలోని పోలీస్ ఐలాండ్ వరుకూ ర్యాలీ సాగింది. అనంతరం సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్ర మంలో జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేష్, గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, గంధం సతీష్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, వర్తనపల్లి కాశి, పాలూరి వెంకటేశ్వరరావు, వాడపల్లి సుబ్బరాజు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
మహిళలను అవమానిస్తే సహించం
తణుకు: మహిళలను అవమానిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. తణుకు నరేంద్ర సెంటర్‌లో తెలుగు మహిళలు, నాయ కులు నిరసన, ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టు కొని నినాదాలు చేశారు. తక్షణమే సాక్షి మీడియా అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దుష్ప్రచారం చేస్తున్న జగన్ ముఠా దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. భారతీరెడ్డి నిర్వహణలో ఉన్న సాక్షి మీడియాలో అమరావతి మహిళలను అవమా నించే వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు. కొమ్మి నేని శ్రీనివాసరావు, కృష్ణంరాజును కఠినంగా శిక్షించా లని డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి సైతం పశ్చాత్తాపం లేకుండా అమరావతి మహిళలను సంకర జాతులు అంటూ నీచంగా మాట్లాడడం దారుణమని, సజ్జలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
మహిళలను కించపరుస్తారా..!
ఏలూరు టూటౌన్: మహిళలను గౌరవించే సంస్కృ తి వైసీపీలో లేదని టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు తవ్వా అరుణకుమారి, అధికార ప్రతినిధి కడియాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలపై నిరసనగా తెలు గు మహిళలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. వసం త్‌మహల్ పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి పాత బస్టాండ్ వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. తల్లి, చెల్లిని బయటకు గెంటేసిన జగన్‌కు ఆడపడుచుల విలువ తెలియదన్నారు. సాక్షి యాజమాని భారతీరెడ్డి రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరూ కూడా మహిళల పై అనుచితంగా మాట్లాడాలంటే భయపడేవిధంగా శిక్షలు ఉండాలన్నా రు. కార్యక్రమంలో నగర కార్యదర్శి కిలారిశెట్టి సంద్యా, సంతోషి, శ్రీదేవి, పద్మా, తదితరులు పాల్గొన్నారు.
సాక్షి మీడియాను నిషేధించాలి
కామవరపుకోట: మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ప్రసారం చేస్తున్న, ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాను నిషేధించాలని తడికలపూడిలో కూటమి నాయకులు, మహిళా ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. సాక్షి దినపత్రిక ప్రతులను దహనం చేశారు. కొత్తగూడెం రామాలయం నుంచి మహిళలు ప్లకార్డులతో తడికల పూడి ప్రధాన సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళలతోపాటు నాయకులు ఏలూరి హరిరామకృష్ణ, కోనేరు సుబ్బారావు, ఘంటా సుధీర్‌బాబు, వెలమటి నాగేశ్వరరావు, మేరుగు సుందరరావు, నెక్కలపు గంగా ధరరావు, నెల్లూరి సత్తిబాబు, అబ్బూరి లక్ష్మీనారాయణ, సురేష్, బొబ్బిలి డాన్ దివాకర్, తుమ్మల సత్యనారా యణ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీకి బుద్ధి రాలేదు
భీమవరం అర్బన్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): వేశ్యల రాజధానిగా వ్యాఖ్యానించడం దారుణమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి అన్నారు. రాయలంలో మంగళవారం సాక్షి దినపత్రిక ప్రతులను తగల బెట్టారు. అమరావతి రాజధాని మహిళలు, ప్రజలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్, యాజమాన్యంపై చర్యలు తప్పవన్నారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ వారికి బుద్ధి రాలేదన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉంగుటూరు: తహసీల్దార్ కార్యాలయం నుంచి హైవే వరకు తెలుగు మహిళలు ర్యాలీ నిర్వహించారు. శరణాల మాలతీరాణి, అక్కిన నాగమణి, ఉన్నమట్ల సునీతరాణి, యెగ్గిన శ్యామల, అడపా శోభారాణి, బండారు సింధు, దిడ్ల అలకనంద పాలొన్నారు.