Share News

నిండు జీవితం నిలబడింది

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:26 AM

మానసిక ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను ఏలూరు శక్తి టీమ్‌ పోలీసు లు సకాలంలో కాపాడి ఆమె ప్రాణాలను నాడు నిలిపారు.

నిండు జీవితం నిలబడింది
మహిళను అభినందిస్తున్న మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ సుబ్బారావు

నాలుగు నెలల క్రితం మహిళ ఆత్మహత్యాయత్నం

సకాలంలో స్పందించి కాపాడిన శక్తి టీం

తాజా డీఎస్సీలో టీచర్‌ ఉద్యోగం సాధించిన మహిళ

మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది అభినందనలు

ఏలూరు క్రైం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): మానసిక ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను ఏలూరు శక్తి టీమ్‌ పోలీసు లు సకాలంలో కాపాడి ఆమె ప్రాణాలను నాడు నిలిపారు. పోలీసుల కౌన్సెలింగ్‌తో ఆమె జీవితంలో ముందడుగు వేసింది. మెగా డీఎస్సీలో నేడు ఉద్యోగం సాధించింది. కష్టాల నుంచి గటెక్కానని, పిల్లలను కూడా ఉన్నత చదువుల దిశగా నడిపిస్తున్నానని ఆత్మవిశ్వాసంతో చెబుతుంది.

కృష్ణాజిల్లాకు చెందిన యువతి పదో తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేసింది. ఏలూరులో అమ్మమ్మ ఇం టికి తరచుగా రావడంతో ఆ ఇంటి పక్కనే యువకుడితో పరిచయం పెళ్లికి దారి తీసింది. తర్వాత ప్రైవేటుగా ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఎంఏ, బీఈడీ చదివింది. ప్రైవేటు టీచరుగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. అంతలో ఆమె జీవితంలో భారీ కుదుపు. భర్త వ్యసనాలకు బానిస కావడంతో తరచు గొడవలు. అతడి వేధింపులు భరించలేక 2024లో కోర్టు నుంచి విడాకులు కూడా తీసుకుంది. తర్వాత స్నేహితురాలి సూచనతో విడాకులు తీసుకున్న భర్తతో సర్దుబాటు చేసు కుంది. తిరిగి పిల్లలు, భర్తతో ఏలూరులోనే నివాసం ఉన్నారు. తర్వాత కొన్నాళ్లకు భర్త వేధింపులు యథాతథం కావడంతో చనిపోవాలనుకుంది.

రైలు పట్టాలపై నిలబడి..

గడచిన మే 23న ఏలూరు ఎన్‌ఆర్‌పేట వద్ద రైలు పట్టాలపై నిల బడింది. స్థానికులు గమనించి వెంటనే 112కు కాల్‌ చేశారు. వెంటనే స్పందించిన మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ, శక్తి టీమ్‌ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ ఎం.సుబ్బారావు, మహిళా కానిస్టేబుళ్లు సుజాత, శ్రావణి, సిబ్బంది కలిసి రైలు పట్టాల నుంచి ఆమెను పక్కకు లాగారు. ఆ మరుక్షణం రైలు దూసుకుపోయింది. ఒక్కక్షణం ఆలస్యమైనా ప్రాణాలు కోల్పోయేది. పోలీ సులు ఆమెతో పాటు ఆమె భర్తను కూడా పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

మలుపు తిప్పిన డీఎస్సీ

ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించ డంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. పట్టుదలతో చదివి డీఎస్సీలో విజయం సాధించి ఓపెన్‌ క్యాటగిరిలో స్కూలు అసిస్టెంట్‌గా ఎంపి కైంది. తనువు చాలించాలని నిర్ణయించుకున్నా.. ఒత్తిడి, కష్టాలను అధిగమించి జీవితంలో గెలిచిన ఆమెను మహిళా పోలీసుల మళ్లీ పిలిచారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఎం.సుబ్బారావు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. తన జీవితం, కుటుంబాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత చేపట్టడం స్ఫూర్తిదాయకం అన్నారు. మహిళ జీవితాన్ని మార్చిన శక్తి టీమ్‌ సభ్యులను సీఐ అభినందించారు.

క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం..

క్షణాకావేశంలో తీసుకున్న తీవ్ర నిర్ణయం తన పిల్లల భవిష్యత్‌ను కూడా చిదిమేసి. ఉండేదని, అన్ని కష్టాలను అధిగమించి ముందుకు సాగుతున్నాని ఆమె ఆనందంగా చెప్పింది. తన ఇద్దరు పిల్లలు త్రిపుట్‌ ఐటీలో చదువుతున్నారని సంతోషంగా చెప్పింది. శక్తి టీమ్‌ పోలీసులు తనలో ఆత్మస్థైర్యం నింపారని, ముందడుగు వేసి డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పిం ది. ఆ మహిళను పలువురు అభినందించారు. సీఐ సుబ్బారావుతోపాటు, శక్తి టీమ్‌ సభ్యులైన మహిళా ఎస్‌ఐ నాగమణి, మహిళా కానిస్టేబుళ్లు సుజాత, గౌరీ, దేవి, గోపాల్‌ ఆమెను అభినందించారు.

Updated Date - Sep 22 , 2025 | 12:26 AM