Share News

గల్లంతైన మహిళల్లో ఒకరి మృతదేహం లభ్యం

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:12 AM

పూచికపాడుకు చెందిన ఇద్దరు మహిళలు సమీప తెలంగాణ ప్రాంతం చెన్నాపురం వద్ద కూలీ పనికి వెళ్లి వస్తూ కొండవాగు దాటుతుండగా వరద ఉదృతికి కొట్టుకుపోయారు.

గల్లంతైన మహిళల్లో ఒకరి మృతదేహం లభ్యం
ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల గాలింపు

మరొకరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు

జీలుగుమిల్లి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పూచికపాడుకు చెందిన ఇద్దరు మహిళలు సమీప తెలంగాణ ప్రాంతం చెన్నాపురం వద్ద కూలీ పనికి వెళ్లి వస్తూ కొండవాగు దాటుతుండగా వరద ఉదృతికి కొట్టుకుపోయారు. పోలవరం డీఎస్పీ బి.వెం కటేశ్వరావు ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృం దాలు ఆదివారం గాలింపు చర్యలు ముమ్మ రం చేశారు. గల్లంతైన వారిలో పాలడుగుల చెన్నమ్మ (50) మృతదేహం లభ్యమైంది. మరో మహిళ పచ్చిపాల వరలక్ష్మి ఆచూకీ సాయంత్రం లభ్యం కాలేదు. డ్రోన్‌ సిబ్బంది పరిసర కొండవాగుల ప్రాంతాలు పరిశీలిం చారు. చెన్నమ్మ మృతదేహాన్ని ఆశ్వారావు పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆస్పత్రిలో బాధిత కుటుంబీకుల్ని పరామర్శించారు. వారికి తగిన సాయం అందేలా చర్యలు తీసుకుం టామన్నారు. జీలుగుమిల్లి సీఐ బి.వెంకటేశ్వ రావు, ఎస్సైలు వి.క్రాంతికుమార్‌, పి.నవీన్‌కు మార్‌, తహసీల్డారు ఉదయ్‌ భాస్కర్‌, సరిపల్లి సత్యనారాయణరాజు ఉన్నారు.

రామిలేరులో యువతి గల్లంతు

నూజివీడు టౌన్‌: రామిలేరు వాగు దాటుతున్న తుక్కులూరు గ్రామానికి చెంది న యువతి ఆదివారం గల్లంతైంది. తుక్కు లూరు పాత దళితవాడకు చెందిన బడిపాటి సర్వేశ్వరరావు కుమార్తె నీరజ (22) ఆది వారం మర్రికుంటలోని చర్చికు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో రామిలేరు ఉధృ తికి నీటిలో గల్లంతైంది. నీరజ నూజివీడులో బి ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. యువతికోసం నూజివీడు రూరల్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - Sep 15 , 2025 | 12:12 AM