Share News

ఆర్‌ఎంపీ వైద్యం వికటించి.. వివాహిత మృతి

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:16 AM

ఆర్‌ఎంపీ వైద్యం వికటించి జ్వరంతో బాధపడుతున్న ఓ వివాహిత మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మృత దేహంతో ఆర్‌ఎంపీ క్లినిక్‌ వద్ద ఆందోళనకు దిగారు.

ఆర్‌ఎంపీ వైద్యం వికటించి..  వివాహిత మృతి

కుటుంబ సభ్యుల ఆందోళన

ప్రభుత్వాసుపత్రికి మృతదేహం తరలింపు

ఏలూరు క్రైం, సెప్టెంబరు 2(ఆంధ్ర జ్యోతి):ఆర్‌ఎంపీ వైద్యం వికటించి జ్వరంతో బాధపడుతున్న ఓ వివాహిత మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మృత దేహంతో ఆర్‌ఎంపీ క్లినిక్‌ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. ఏలూరు తూర్పు వీధి మేకల కబేళా ప్రాంతా నికి చెందిన కటారి భారతి లక్ష్మి(25)కు భర్త వెంకటే శ్వరరావు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. వెంకటేశ్వరరావు ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మి మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. నాని క్లినిక్‌ నిర్వహిస్తున్న వంగాయగూడేనికి చెందిన ఆర్‌ఎంపీ గంచరి సురేశ్‌ బాబు(నాని) వద్దకు ఆమెను మం గళవారం ఉదయం తీసుకు వెళ్లగా రెండు ఇంజక్షన్లు చేశాడు. ఇంజక్షన్లు చేసిన కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వైద్యుడిని ప్రశ్నించగా ఏం కాదని కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చాడు. ఆమె ఎంతకీ మేల్కొనకపోవడంతో ఏలూరు టూ టౌన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువులు మృతదేహాన్ని నాని క్లినిక్‌ వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. ఏలూరు వన్‌టౌన్‌ సీఐ జి.సత్యనారాయణ సిబ్బంది వచ్చి పరి స్థితిని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 01:16 AM