Share News

విభజన ఆశలు

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:06 AM

మళ్లీ ఆశల పల్లకీ. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఎన్నో ప్రజా విజ్ఞాపనలు. నాయకుల నోట ఇంకొన్ని హామీల వెల్లువ. ఉమ్మడి జిల్లాల్లో ఉన్న స్థితిగతులకు లోబడి రాజకీయంగా, పాలనా పరంగా సర్దుకు పోయేవారు.

విభజన ఆశలు

మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

ఇంతకుముందున్న అభ్యంతరాలకే జీవం

నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కష్టం

నూజివీడు, కైకలూరు డిమాండ్‌లు మళ్లీ మొదటికి

మళ్లీ ఆశల పల్లకీ. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఎన్నో ప్రజా విజ్ఞాపనలు. నాయకుల నోట ఇంకొన్ని హామీల వెల్లువ. ఉమ్మడి జిల్లాల్లో ఉన్న స్థితిగతులకు లోబడి రాజకీయంగా, పాలనా పరంగా సర్దుకు పోయేవారు. కానీ జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత మొత్తం సీన్‌ తలకిందు లైంది. పరస్పరం సహకారం ఉండా ల్సింది పోయి కాస్త దూరంగా జరగాల్సి వచ్చింది. సామాజికవర్గాలకు కూడా సమతుల్యమే దెబ్బతిన్నట్లైంది. మళ్లీ జిల్లాల పునర్విభజన సమయంలో వెలువడిన అభ్యంతరాలు, డిమాండ్లు, స్థానికంగా ఉన్న సంప్రదాయాలు, సెంటి మెంట్లు అన్నింటిని కలబోసి సరికొత్త అధ్యయనానికి వీలుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఇప్పటివరకు సాగిన డిమాండ్లు, ఎత్తుగడలు మళ్లీ పదు నెక్కబోతున్నాయి. రాజకీయపరంగా ఈ నిర్ణయం కొందరికి సవాలే.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

పార్లమెంటరీ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని నూతన జిల్లాల ఏర్పాటుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం 2022లోనే ముందడుగు వేసింది. ఎవరు కాదన్న, కనీసం వాదనలకు తావులేకుండా తాము అనుకున్నది అనుకున్నట్లుగానే జిల్లాలు ఏర్పాటు చేశారు. అనేక సందేహాలు, అను మా నాలు, వివాదాలు తలెత్తినా అప్పట్లో డోంట్‌కేర్‌గా వ్యవహరించారు. ఏలూరు జిల్లాలో నూజివీడు, కైక లూరు ఉండేలా చూశారు. కాని సుదీర్ఘకాలం పాటు అటు గుడివాడ, ఇటు విజయవాడతో సాన్ని హిత్యం ఉన్న ఈ రెండు నియోజకవర్గాల జనం లబోదిబోమన్నారు. రాజకీయపరంగా, పాలనా పరంగా తమకు ఇది ఆమోదయోగ్యం కాదన్నా రు. తమకు వ్యాపార సంబంధాలున్న విజయవాడ ను కాదని ఏలూరును జిల్లా కేంద్రంగా ఉండడం తో నూజివీడు వాసులు ససేమిరా వీల్లేదని అడ్డం తిరిగారు. పాలనాపరంగా తమకు ఏలూరుతో సత్సంబఽంధాలు లేని విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పా రావు కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తూ ఏకంగా నిరసన ర్యాలీలకు దిగారు. కానీ నిర్ణయం జరిగిపోయిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని, అంతకంటే మించి నిరసనలు మరింత పేట్రేగితే వైసీపీ పెద్దల నుంచి ఇంకో రకం ఒత్తిడులను ఎదుర్కొవాల్సి వస్తోందని అప్పట్లో ప్రతాప అప్పారావు కూడా మదనపడాల్సి వచ్చింది. ఇదే తరుణంలో నూజివీడు నియోజక వర్గాన్ని ఉమ్మడి కృష్ణాలోనే కొనసాగించాలన్న డిమాండ్‌ ఎన్నికల ప్రచారాన్ని తాకింది. ఈ నేపథ్యంలోనే నూజివీడులో ఎన్నికల పర్యటనకు వచ్చిన ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. దీనిపై ప్రజలు సంతృప్తిపడేలా విధాన ప్రకటన చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అప్పట్లో జనం నుంచి ఎదురైన స్పందన చూసి చంద్రబాబే.. మీరంతా విజయవాడకు దగ్గరగా ఉంటున్నారు. ఏలూరు వద్దంటున్నారు. తెలుగు దేశం అధికారంలోకి వస్తే వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తా. ఉమ్మడి కృష్ణాలోనే నూజివీడును కొనసాగించేలా చూస్తానని ఎన్నికల హామీ ఇచ్చే శారు. ఇదే తరుణంలో నూజివీడు డివిజన్‌ పూర్తి గా బలహీనపడింది. డివిజన్‌ కేంద్రంగా నూజి వీడుకు గొప్ప చరిత్ర ఉంది. దీనిని దృష్టిలో పెట్టు కుని డివిజన్‌ను యఽథావిథిగా కొనసాగించేందుకు చింతలపూడి, లింగపాలెం మండలాలను నూజి వీడు డివిజన్‌లో విలీనం చేశారు. దీంతో అప్పటి వరకు ఏలూరుతో సత్సంబంధం ఉన్న ఈ రెండు మండలాలకు చెందిన వారు రెవెన్యూ డివిజన్‌లో విలీనాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అయినా విలీ నం ప్రక్రియ అధికారికంగా జరిగినందున అప్పట్లో ఏ పార్టీకి చెందిన వారైనా ఏమీ చేయలేని పరి స్థితి.ఇప్పటికీ నూజివీడు రెవెన్యూ డివిజన్‌ అంటే చింతలపూడినే రెవెన్యూ డివిజన్‌గా మార్చాలనే ప్రతిపాదన కొందరి నోట తెరపైకి వచ్చింది. సాధా రణంగా ఏలూరుకు అత్యంత సమీపంగా ఉన్న మండలాలను కాస్తంత దూరంగా ఉన్న నూజి వీడుకు బదలాయించడమే ఇప్పటికీ ఆ ప్రాంత వాసులకి అసంతృప్తి మిగిల్చింది.

కైకలూరు నియోజకవర్గ వాసులు ఇంకో డిమాం డ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో కైకలూరు గుడివాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉండేది. విభజన తర్వాత ఈ ప్రాంతం కాస్త ఏలూరు డివిజన్‌ పరిధిలోకి వచ్చింది. దీంతో తమను గుడి వాడకే పరిమితం చేయాలని డివిజన్‌ కేంద్రాన్ని మార్చవద్దంటూ అభ్యంతరాలు వెలువెత్తాయి. అయినా సరే ప్రభుత్వం మాటే చెల్లింది. నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల వారీగా ఆనాడు అభిప్రాయ సేకరణలో వచ్చిన సూచన లు ఇప్పటికీ జనం నోటే నానుతున్నాయి. మరోవైపు పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) గోపాల పురం నియోజకవర్గం ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ స్థానికంగా వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా చిన్నతిరుపతిని ఏలూరు జిల్లాలో విలీనం చేశారు. ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోని గణపవరాన్ని స్థానిక డిమాండ్ల మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేశారు.

పోలవరం కఽథ ఇంకొకటి ..

పోలవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని చాలాకాలం పాటు డిమాండ్‌ కొనసాగుతూ వచ్చింది. ఎన్నికల ప్రచా రంలో అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఇటు వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు స్థానికులు నేరుగానే డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ముంపు మండలాలన్నింటిని కలిపి పోలవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాల్సిందేనన్న డిమాండ్‌ కొనసాగుతూ వచ్చింది. కానీ భౌగో ళికంగా ఉన్న పరిస్థితులు డిమాండ్‌కు వ్యతిరేకంగా ఉండటంతో ముందడుగు పడలేదు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలవరం జిల్లా డిమాండ్‌ కొనసాగుతోంది. ఈ తరహా పరిస్థితులన్నింటిపైన మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించబోతోంది. దీనికి అనుగుణంగా కూటమి, వైసీపీ భవిష్యత్‌లో స్థానిక అంశాల ఆఽధారంగా మరికొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చే అవకాశాలు లేకపోలేదు.

Updated Date - Jul 24 , 2025 | 01:06 AM