Share News

ఇంటి దొంగలెవరు ?

ABN , Publish Date - Sep 21 , 2025 | 01:06 AM

ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లో డిపాజిట్‌ సొమ్ములు పక్కదారి పట్టాయి. కొందరు ఆర్థిక అవక తవకలకు పాల్పడడంతో రావాల్సిన సొమ్ములు ఏళ్ల తరబడి అందక డిపాజిట్‌ దారులు గగ్గోలు పెడుతున్నారు.

ఇంటి దొంగలెవరు ?

ఆలస్యంగా వెలుగు చూసిన అవినీతి

పలువురు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు

సహకార శాఖ అధికారితో విచారణకు ఆదేశం

అసలు, వడ్డీ రాక చిరుద్యోగుల అవస్థలు

ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లో డిపాజిట్‌ సొమ్ములు పక్కదారి పట్టాయి. కొందరు ఆర్థిక అవక తవకలకు పాల్పడడంతో రావాల్సిన సొమ్ములు ఏళ్ల తరబడి అందక డిపాజిట్‌ దారులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై బాధితులు ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో సహకార శాఖ అధికారి విచారణ జరుపుతున్నారు. (ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఏలూరు కేంద్రంగా జిల్లా రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయం వెనుక ఆర్‌ అండ్‌బీ ఉద్యోగుల కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ వుంది. పాలక వర్గం లేని సమయంలో కొందరు ఉద్యోగులు అఽధ్యక్ష, కార్యదర్శి, ట్రెజరర్‌, గుమస్తాలుగా నియమితు లయ్యారు. ఆ సమయంలో వంద మంది ఉద్యోగులు సభ్యులుగా వున్నారు. వీరంతా ఎక్కువ వడ్డీ వస్తుం దని, అత్యవసరాలకు, ఇళ్లు, స్థలాలు కొనుగోలుకు ఉప యోగపడుతుందని రెండు, ఐదేళ్ల కాలపరిమితికి ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లు చేశారు. ఏటా వార్షిక సమావేశాలను నిర్వహించి సభ్యులంతా లాభాలను డివిడెండ్లు పం చుకునేవారు. అయితే కొందరి ఉద్యోగుల స్వార్థం చిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. డిపాజిట్ల సొమ్ములను పక్కదారి పట్టించారు.

ఆడిట్‌లోపాలను కప్పిపుచ్చారా ?

క్రెడిట్‌ సొసైటీలావాదేవీలు, ఇతర కార్యకలాపాల పై జిల్లా సహకార శాఖ ఆడిట్‌ విభాగం ఏటా ఆడిట్‌ నిర్వహించాలి. ఇందులో గుర్తించిన లోపాలను బయ టపెట్టకుండా కప్పి ఉంచడంతో ఇప్పుడు 25 మందికి పైగా డిపాజిట్‌దారులకు అసలు మొత్తాలను ఇవ్వడ మే గగనంగా మారింది. ఇందులో ఆరుగురు బయట వ్యక్తులు డిపాజిట్లు చేశారు. వీరికే దాదాపు రూ.33 లక్షలు చెల్లించాలి. మరోవైపు రూ.40 లక్షలు అప్పులు కట్టాలి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ సొసైటీ పీకలలోతు నష్టాల్లో కూరుకుపోయింది. 2009లో డిపాజిట్‌ చేసిన వారికి నేటికీ డిపాజిట్‌ మొత్తాలకు అసలు, వడ్డీ ఇవ్వ డం లేదు. ఇక్కడ అనఽధికార గుమస్తా, ఆయనకుతోడు ఓ ప్రైవేట్‌ మహిళా చిరుద్యోగి డిపాజిట్‌దారులకు చుక్కలు చూపిస్తున్నారు. రికవరీలు అయితేనే అసలు ఇస్తామని చెబుతున్నారు.

పర్సన్‌ ఇన్‌చార్జ్‌ నియామకం

విషయం వెలుగు చూడడంతో నెల క్రితం సహకా ర శాఖ నుంచి కిరణ్‌కుమార్‌ అనే అధికారిని ఈ సొసైటీకి పర్సన్‌ ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన పర్యవేక్షణలో రికవరీలు చేసి.. కాల పరిమితి తీరిన డిపాజిట్లకు అసలు మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే ఏళ్ల తరబడి దాచుకున్నా తమకు ఏ ప్రయోజనం లేకపోయిందని చిరుద్యోగులు వాపోతున్నారు. క్రెడిట్‌ సొసైటీ అవకతవకలపై విచారణాధికారిగా నియమి తులైన నాగేశ్వరరావు వివరణ ఇస్తూ శాఖాపరంగా విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదికను ఉన్నతా ధికారులకు అందించనున్నట్టు తెలిపారు

మొండి బకాయిలు.. డిఫాల్టర్ల వల్లనే..

ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల క్రెడిట్‌ సొసైటీలో బాధితుల కు అసలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ సొసై టీ గతంలో రూ.20 లక్షలు రుణం తీసుకుంది. తిరిగి కట్టకపోవడంతో రూ.40 లక్షలకు చేరింది. సభ్యుల్లో 11 మంది డిఫాల్టర్లు ఉన్నారు. వీరిపై విచారణాధికారి లోతైన అధ్యయనం చేస్తే అసలు దొంగలు తేలతారని భావిస్తున్నాం. ఇటీవల ఇద్దరికి అసలు మొత్తాలు చెల్లించాం. 2011 డిపాజిట్లు చేసిన వారికి రికవరీ చేసి న మొత్తాల నుంచి అసలు మాత్రమే ఇవ్వగలు గుతు న్నాం. బాధ్యులు ఎవరనేది తేలితే వారి నుంచి రెవె న్యూ రికవరీ యాక్టు కింద ఆయా మొత్తాలను వసూ లు చేయడానికి అవకాశం ఉంది.

– కిరణ్‌కుమార్‌, పర్సన్‌ ఇన్‌చార్జి

Updated Date - Sep 21 , 2025 | 01:06 AM