మీ సమస్య – నా పరిష్కారం
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:23 AM
నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వాట్సాప్ వేదిక ఏర్పాటు చేశారు.
తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ వాట్సాప్ వేదిక
తణుకు, జూన్ 22(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వాట్సాప్ వేదిక ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా మీ సమస్య – నా పరిష్కారం పేరుతో నియోజకవర్గస్థాయిలో ప్రజల సమస్యలు వినిపించేందుకు వాట్సాప్ ద్వారా ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆర్దిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏడాది కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తన దృష్టికి తీసుకురావడానికి, స్థానిక సమస్య లు ఫొటోతో తెలియజేయడానికి వాట్సాప్ వేదికను ప్రజలు ముందుకు తీసుకువచ్చామన్నారు. యువ నా యకుడు, మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తితో వాట్సాప్ వేదిక ను తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. తాను ఏడాదిలో 365రోజులకు 294రోజులు ప్రజల మధ్యనే ఉన్నానని ఆయన తెలిపారు.
వాట్సాప్ ఎలా..
నియోజవర్గ ప్రజలు అత్యధిక మోజార్టీతో గెలిపిం చారు. ప్రజల నమ్మాకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏడాదిలో అనేక సమస్యలు అధిగమించామని, మెరుగైన పాలన లక్ష్యంతో వాట్సాప్ వేదికను ప్రజల ముందుకు తీసుకొచ్చాను. వాట్సాప్ నెంబర్ 94934 22222 ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. ప్రజలు వార్డులు, గ్రామాల్లో సమస్యలు ఫొటోతో సహా సమస్య తెలియజేస్తే సంబంధిత వ్యక్తి పేరుతో సహా నమోద వుతుంది. యాప్‌లో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఉంటా యి. వాట్సాప్‌లో హాయ్ అని టైపు చేస్తే పేరు, ఊరు, వార్డు, సమస్య వంటి ఆప్షన్ల ఎంపిక ఉంటాయి. వాటిని పూరించి సమస్య, ఫొటో నమోదు చేస్తే పరిష్కారానికి కృషి చేస్తాం. వాట్సాప్ బ్రోచర్లు మునిసిపాల్టీ, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల వద్ద ప్రచారం నిమిత్తం ఉంచాం. నియోజకవర్గ ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి.