ఇదేంటి..సారూ?
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:30 AM
ఆర్టీసీ ఉచిత సర్వీసులు
స్త్రీ శక్తి పఽథకంతో.. సరిహద్దు వరకే ఆర్టీసీ ఉచిత సర్వీసులు పరిమితం
జీలుగుమిల్లి, ఆగస్టు 24(ఆంరఽధజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన స్త్రీశక్తి పథకంతో ఆంధ్రా ఉచిత బస్సు సర్వీసులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి. కొద్దిరోజులుగా ఆంధ్రా–తెలంగాణ సరిహద్దు జీలుగుమిల్లి వరకే ఆంధ్రాకు చెందిన పల్లె వెలుగు సర్వీసులు తిరుగుతున్నాయి. గతంలో ఈ సర్వీసులు తెలంగాణ– ఆంధ్రా మధ్య అంతరాష్ట్ర సర్వీసులుగా అశ్వారావుపేట వరకు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు ఆంధ్రా సరిహద్దున నిలిపివేస్తున్నారు. ఆదివారం కూడా ఏలూరు– జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం–జీలుగుమిల్లి వరకే పల్లె వెలుగు బస్సులు నడిచాయి. జీలుగుమిల్లిలో కొంతసేపు ఆగి ప్రయాణికులను తరలిస్తున్నాయి. దీంతో విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు మధ్యలో తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట దాటితేనే ఆయా మండలాలకు చేరుకోవాల్సి రావడంతో స్త్రీ శక్తి పఽథకం అయా మండలాల మహిళలకు అమ లు కావడం లేదు. తమకు కూడా ఉచిత బస్సు పథకం అమలు చేయాలంటూ ఇటీవల ఆందోళనలకు సైతం దిగారు. ఈ క్రమం లోనే ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల పల్లె వెలుగు బస్సులను సరిహద్దు వరకే నడపడంతో ఆ రెండు మండలాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో దారిలేక ఎక్స్‌ప్రెస్, ఆటోలకు ఎక్కువ చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. సరిహద్దున రెండు రాష్ర్టాల మధ్య రాకపోకలు తమ సమస్యను పరిష్కరిం చాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మేనేజరు గంగాధర్‌ను వివరణ కోరగా ప్రజా ప్రతి నిధులు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి ముంపు మండలాల ప్రజల సమస్య వెళ్లిందని త్వరలో నిర్ణయం తీసుకుంటారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా సర్వీసులను ఆంధ్రాకు మాత్రమే పరిమితం చేశారన్నారు.