ఇదేంటి మాస్టారు..?
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:51 AM
గురుపూజోత్సవ వేళ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ఎంపిక, తుది ఆమో దముద్ర విషయంలో గురువారం హైడ్రామా నడిచింది.
ఇదేంటి మాస్టారు..?
వివాదాస్పదమైన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
పోలీసు ఎంక్వయిరీ షరతుపై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం
టీచర్లను అగౌరవపర్చారు : ఫ్యాప్టో
25 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
ఇద్దరు హెచ్‌ఎంలకు తిరస్కారం
నేడు ఏలూరులో గురు పూజోత్సవం
ఏలూరు అర్బన్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యో తి):గురుపూజోత్సవ వేళ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ఎంపిక, తుది ఆమో దముద్ర విషయంలో గురువారం హైడ్రామా నడిచింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన టీచర్ల ఖరారు, తుది జాబితాపై ఉన్న తాధికారుల ఆమోదముద్ర ఒకరోజు ముందు గానే జరగడం సహజం కాగా, ఈ ఏడాది భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాస్థాయి పురస్కా రాలకు ఎంపికైన 25 మంది టీచర్లపై క్రిమినల్ కేసులు, నేరచరిత్ర లేవని పోలీసుశాఖ నుంచి ధ్రువీకరణను కోరడం అటు ఉపాధ్యాయుల్లోను, ఇటు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) సభ్య సంఘాల్లోను తీవ్ర అభ్యంతరా లు, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. పలు పరిణా మాల అనంతరం గురువారం రాత్రి 8 గంటల సమయంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారాలకు ఎంపికైనవారి జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. గురువులను గౌర వించాల్సిన రోజున వారిని పోలీసు క్లియరెన్స్ పేరిట అవమానపర్చేలా వ్యవహరించారని ఫ్యాప్టో నాయకులు విమర్శించారు.
అసలు ఎందుకిలా..
వాస్తవానికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అందజేసే దరఖాస్తుతో పాటే సంబంధిత టీచరు తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి పురస్కారాలకు గతంలో ఇటువంటి నిబంధనలేవీ లేవని చెబుతున్నారు. ఈ దఫా అర్హతలు, ఎంపికలకు తోడు పోలీసు క్లియరెన్స్ ను అమలు చేయాలని చివరి నిమిషంలో షర తు పెట్టారు. పోలీసు క్లియరెన్స్(ఎంక్వయిరీ) అంశం బుధవారమే తెరపైకి రాగా క్షేత్రస్థాయి లో టీచర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. క్లియ రెన్స్ సర్టిఫికెట్‌ను మీసేవా కేంద్రాల నుంచి తెచ్చుకోవాలని ఉపాధ్యాయులకు సూచించినట్టు తెలుస్తోంది. ఒకదశలో పోలీసు క్లియరెన్స్ సర్టి ఫికెట్ అవసరం లేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి భిన్నంగా గురువారం ఉదయం పోలీసు క్లియరెన్స్‌ను తప్పనిసరి చేయడంతో రాత్రివరకు డైలమా, ఉపాఽధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలు కొనసాగాయి. పోలీసు క్లియరెన్స్ లభించిన తర్వాతే అవార్డు లకు ఎంపికైన టీచర్ల జాబితాకు ఆమోదముద్ర పడినట్టు ప్రచారం జరుగుతోంది.
టీచర్లను అగౌరవపర్చడమే : ఫ్యాప్టో
అర్హతలు గల ఉపాధ్యాయులనే ఎంఈవోలు, డీవైఈవోలు ఎంపికచేసి దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపగా, వాటిని డీఈవో నియమించిన అవార్డుల కమిటీ పరిశీల న అనంతరమే తుదిజాబితాను తయారు చేశా రని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ తెలిపారు. పోలీసు ఎంక్వయిరీ చేసిన తర్వాతే తుదిజాబితాను ప్రకటించాలని జిల్లా ఉన్నతాధికారులు తీసుకు న్న నిర్ణయం ఉపాధ్యాయలోకాన్ని అవమాన పర్చడమేనని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా ఈ జిల్లాలోనే జరి గిందని ఆరోపించారు. టీచర్లను అగౌరవ పరిచే, వారి మనోభావాలను గాయపరిచే ఇటువంటి చర్యలను ఖండిస్తున్నట్టు ఫ్యాప్టో జిల్లా నాయ కులు జి.వెంకటేశ్వరరావు, ఆర్.రవికుమార్, సీహెచ్ శివరామ్, ఐ.రమేష్, టి.రామారావు, కె.పవన్ కుమార్, ఇ.రామ్మోహన్, ప్రధానోపా ధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు వి.మురళీకృష్ణ, జె.రవీంద్ర తెలిపారు.
33 మందికి పురస్కారాలు
జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారా లకు దరఖాస్తు చేసుకున్న 25మంది టీచర్లకూ అవార్డులు దక్కాయి. వీరిలో 15 మంది స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ, 10 మంది ఎస్జీటీ కేటగిరీ ఉపాధ్యాయులున్నారు. మరో ఇద్దరు ప్రధానోపా ధ్యాయులను ఫెలోషిప్ పురస్కారాల కింద సంబంధిత హైస్కూళ్ల టీచర్లు నామినేట్ చేసిన ప్పటికీ చివరినిమిషంలో నిబంధనల మాటున వారిద్దరి పేర్లను జాబితా నుంచి తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా అవార్డులకు ఎంపికైన 25 మందితో పాటు, హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని నేషనల్, స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు పాఠ శాలలకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్–2025 అవార్డు లను సంబంధిత ఉన్నతపాఠశాలల హెచ్‌ఎంలు, వ్యాయామోపాధ్యాయులకు అందజేయనున్నారు. జిల్లాలో ఈ అవార్డులకు పెదవేగి, వట్లూరులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల లు, ఏలూరు సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల, ఏలూరు ఏఆర్‌డీజీకే ము న్సిపల్ హైస్కూలు, కొవ్వలి జడ్పీ హైస్కూలు ఎంపికయ్యాయి. ఈ అవార్డులతో పాటే ఇంటర్మీడియట్ విద్యనుంచి జిల్లా ఉత్తమ జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైన ఒకరికి పురస్కారాన్ని అందజేస్తారు. మొత్తంమీద 33 మందికి అవార్డులను శుక్ర వారం అందజేయడానికి జిల్లావిద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
నేడు ఏలూరు జడ్పీ మీటింగ్ హాలులో అవార్డుల అందజేత
గురుపూజోత్సవాన్ని శుక్రవారం ఉద యం 10.30 గంటలకు ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిం చనున్నట్టు డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపా రు. స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి అధ్య క్షత వహిస్తారని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్, తదితరులు పాల్గొంటారన్నారు. ఎంపికైన వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేస్తామని తెలిపారు.
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ..
బత్తుల అనూరాధ, బయోలాజికల్ సైన్స్, జడ్పీహెచ్‌ఎస్, నూజివీడు. వల్లటూరి వెంకట సీతారామప్రసాద్, పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్, నూజివీడు. నక్కా సరళకుమారి, ప్రైమరీ స్కూలు హెచ్‌ఎం, ఎంపీఎస్ ఏపూరు, పెద పాడు మండలం. మర్రిపాటి పద్మావతి, ఫిజి కల్ డైరెక్టర్, జడ్పీహెచ్‌ఎస్, కలరాయనగూడెం, లింగపాలెం మండలం. పంతగాని వీరకోటి, బయోలాజికల్ సైన్స్, జడ్పీహెచ్‌ఎస్, చను బండ, చాట్రాయి మండలం. పంతగాని సౌమ్య, ఇంగ్లీషు, జడ్పీహెచ్‌ఎస్, నారాయణపురం, ఉంగుటూరు మండలం. పొలిమెట్ల యానీమేరీ సమాదాన పద్మావతి, ఫిజికల్ సైన్స్, సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల, ఏలూరు. పీవీ ఎన్ సత్యనారాయణ, ఫిజికల్ సైన్స్, జడ్పీహెచ్ ఎస్, ధర్మాజీగూడెం, లింగపాలెం మండలం. వి.శ్రీనివాసరావు, ఫిజికల్ సైన్స్, జడ్పీహెచ్‌ఎస్, రామసింగవరం, పెదవేగి మండలం, జె.రామ కృష్ణ, ఫిజికల్ ఎడ్యుకేషన్, జడ్పీహెచ్‌ఎస్, రామసింగవరం, పెదవేగి మండలం. ఎంఎల్‌కే శ్రీనివాసరావు, ఇంగ్లీషు, ఎంపీయూపీఎస్, చింతపల్లి, చింతలపూడి మండలం. షేక్ రంగా వలి, ఇంగ్లీషు, జడ్పీహెచ్‌ఎస్, తోకలపల్లి, నిడ మర్రు మండలం. ఆర్.వెంకట నాంచారయ్య, ఫిజికల్ సైన్స్, దొడ్డిపట్ల, కైకలూరు మండలం. టి.వెంకటఅప్పారావు, ఇంగ్లీషు, జడ్పీహెచ్‌ఎస్, పుట్లచెరువు, మండవల్లి మండలం. ఎ.అప్పా రావు, ప్రైమరీస్కూలు హెచ్‌ఎం, ఎంపీపీఎస్–1, నిడమర్రు.
ఎస్జీటీ కేటగిరీ..
సరాల మహదేవి స్వర్ణ, ఎంపీఎస్, పాతూరు, కామవరపుకోట మండలం. సీహెచ్.కుసుమ కుమారి, ఎంపీపీఎస్, చావలిపాడు, మండవల్లి మండలం. డీకెఎస్‌ఎస్ ప్రకాష్‌రావు, ఎంపీపీఎస్, తిమ్మారావుగూడెం, ఏలూరు మండలం. ఎం.శ్రీనివాసరావు, ఎంపీపీఎస్, లింగాల(ఎఫ్‌ఎస్), మండవల్లి మండలం. పి.రాజ్యలక్ష్మి, ఎంపీయూపీఎస్, వెలమపేట, కైకలూరు మండలం. డి.గంగానమ్మ, ఎంపీపీఎస్, వేంపాడు, నూజివీడు మండలం. ఎస్.నాగేశ్వరరావు, ఎంపీయూపీఎస్, మఠంగూడెం, లింగపాలెం మండలం. ఐ.ఎం నిర్మలకుమారి, ఎంపీపీఎస్, వెంకంపాలెం, చింతలపూడి మండలం. ఎ.వెంకటేశ్వరరావు, ఎంపీఎస్, ఈదులగూడెం, అగిరిపల్లి మండలం. ఒ.ఆనందకుమార్, ఎంపీపీఎస్–1, కాగుపాడు, ఉంగుటూరు మండలం.