ఈ కుక్కలకు ఏమైంది..?
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:46 AM
పలు ప్రాంతాల్లో చర్మ సంబంధ వ్యాధులతో కుక్కలు విలవిల్లాడుతున్నా యి. శరీరమంతా మచ్చలతో, దురదతో కూడిన బాధను అనుభవిస్తూ, విలవిల్లాడుతున్నాయి.
పెదవేగి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పలు ప్రాంతాల్లో చర్మ సంబంధ వ్యాధులతో కుక్కలు విలవిల్లాడుతున్నా యి. శరీరమంతా మచ్చలతో, దురదతో కూడిన బాధను అనుభవిస్తూ, విలవిల్లాడుతున్నాయి. ఒక ఒకదాని నుంచి మరొక దానికి ఈ చర్మ వ్యాధి వ్యాపిస్తుండడంతో వాటి మనుగడకే ప్రమాదకరంగా మారుతోంది. వ్యాధి సోకిన కుక్కలు బహిరంగంగా తిరుగుతుండడంతో ఆ వ్యాధి మనుషులకు సోకే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాంసం దుకాణాల వద్ద కోడి వ్యర్థాల ను ఇవి తినడం వల్లే చర్మ వ్యాధికి కారణమని కొవ్వలి పశు వైద్యాధికారి డాక్టర్ ఎం.హరికృష్ణ తెలిపారు. కోళ్ల పెరుగుదలకు రైతులు యాంటీబయాటిక్స్, ఇతర మందు లను అధికంగా వినియోగిస్తున్నారు. వాటికి సంబంధిం చిన అవశేషాలు కోళ్ల పేగుల్లో ఎక్కువ శాతం నిల్వ ఉంది. కుక్కలు ఆ పేగులు, ఇతర వ్యర్ధాలను తినడం కారణంగా చర్మవ్యాధి (అలెర్జిక్) బారిన పడుతున్నాయి. గాలి ద్వారా మనుషులకు సోకే ప్రమాదం కూడా లేకపోలేదు. జాగ్రత్తగా ఉండడం తప్ప మరో మార్గం లేదు.