Share News

ఆ..ఇళ్ల సంగతేంటి ?

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:13 AM

ప్రధాన మంత్రి ఆవాస యోజన పఽథకంలో 3 కేటగిరీ ఇళ్ల నిర్మాణానికి కుస్తీ పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు అప్పగించారు.

ఆ..ఇళ్ల సంగతేంటి ?

జిల్లాలో 6,843 ఇళ్ల పరిస్థితిపై సర్వే

యాప్‌ ద్వారా నమోదు చేస్తున్న

గృహ నిర్మాణ శాఖ అధికారులు

భీమవరం టౌన్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ప్రధాన మంత్రి ఆవాస యోజన పఽథకంలో 3 కేటగిరీ ఇళ్ల నిర్మాణానికి కుస్తీ పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు అప్పగించారు. పెట్టుబడి అధికం అవుతుండంతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చేలా కొంతమంది లబ్ధిదారులు కేటగిరీ–3 ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నారు. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురంలో కేటగిరీ–3 లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు. ఒక్క భీమవరంలోనే కాంట్రాక్టర్‌ ఇళ్ళు నిర్మిస్తున్నారు. విడతల వారీగా పూర్తి చెయ్యటానికి కసరత్తు చేస్తున్నారు. మిగిలిన పట్టణాల్లో కాంట్రాక్టర్లు చేతులు ఏత్తేశారు. మూడో కేటగిరీలో నిర్మించిన ఇళ్లకు కొన్ని నెలలుగా బిల్లులు మంజూరు కావటం లేదు. దీనిపై అసెంబ్లీలో చర్చసాగింది. క్షేత్రస్ధాయిలో పరిశీలన జరిపి ఇళ్ళ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం దిశా నిర్ధేశం చేసింది.తరువాతే బిల్లు మంజూరు చెయ్యనుంది. దీంతతోఓ సర్వేలో అధికారులు నిమగ్నమయ్యారు. కేటగిరి–3లో కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న ఇళ్లకు రూ.1.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మహిళలకు బ్యాంకుల నుంచి మరో రూ.35 వేలు రుణం రూపంలో మంజూరు చేస్తున్నారు. ఇలా ఒక్కొ ఇంటికి రూ.2.15 లక్షలు సమకూరుతోంది. ఇంటి నిర్మాణానికి ఈ నిధులు సరిపోవడం లేదు. లబ్ధిదారులు కొంత పెట్టుబడిగా కాంట్రాక్టర్‌కు ఇస్తున్నారు. ఫలితంగా భీమవరం వంటి ప్రాంతంలోనే 3వ కేటగిరి ఇళ్ళు కొంతమేర ముందుకు వెళ్తున్నారు. నరసాపురంలో కాంట్రాక్టర్‌ పూర్తిగా చేతులు ఎత్తేశారు. ముగ్గురు కాంట్రాక్టర్లపై కేసులు నమోదుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఐనా స్పందన అంతంతమాత్రంగానే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో స్ధలాలు కేటాయించటం వల్ల సమస్య ఏర్పడింది. ఇంటి నిర్మాణానికి పెట్టుబడి అధికం అవుతోంది. లబ్ధిదారులు సొంతంగా ఇళ్ళు నిర్మించుకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అవి కూడా పూర్తి కావడం లేదు. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ కొంతమ మంది కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరింది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

పరిశీలనలో 6,843 ఇళ్లు

కేటగిరీ–3కు సంబంధించి 6,843 ఇళ్ళు సర్వేచేసి నివేదిక ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఆ యాప్‌లో గృహ నిర్మాణ శాఖ ఏఈ పరిశీలన చేసి ఫోటో తీసి వాస్తవ పరిస్థితిని నమోదు చేస్తారు. దీంతో పాటుగా డీఈఈ, తరువాత డీవీహెచ్‌, చివరగా పీడీ కూడా పరిశీలించి నమోదు చెయ్యవలసి ఉంటుంది. ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది.

Updated Date - Nov 03 , 2025 | 12:13 AM