Share News

ధాన్యం మొత్తం కొంటాం

ABN , Publish Date - May 08 , 2025 | 12:40 AM

జిల్లా అభివృ ద్ధికి అన్ని విధాల చర్యలు చేపట్టినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం లో ఆయన మాట్లాడారు.

ధాన్యం మొత్తం కొంటాం
జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంత్రులు

జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు

ధాన్య కొనుగోలు లక్ష్యం పెంపు

మేలైన వరి వంగడాలపై దృష్టి

ఆస్పత్రులలో మెరుగైన సేవలు

కాల్వల ప్రక్షాళనపై చర్చ

ఆక్వా రంగానికి చేయూత

భీమవరం టౌన్‌, మే 7(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృ ద్ధికి అన్ని విధాల చర్యలు చేపట్టినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం లో ఆయన మాట్లాడారు. ముందుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కలెక్టర్‌ అల్లూరి సీతారామరాజు చిత్రపటా నికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కలెక్టర్‌ నాగరాణి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

రబీ సీజన్‌లో వరి దిగుబడి, కొనుగోలు అంశాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమీక్షించారు. రబీ సీజన్‌లో ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రు గొట్టిపాటి, నిమ్మల రామానాయుడు అన్నారు. జిల్లాలో సాగు చేస్తున్న వరి రకాలు, వాటికి మార్కెట్‌ తదితర వివరాలు మంత్రి గొట్టిపాటి అడిగి తెలు సుకున్నారు. రేషన్‌ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలు, ప్రజలు అందరూ వినియోగించే వరి వంగడాలను సాగుకు సూచించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులను కూడా ఆరా తీసి మంచి వెరైటీని సూచించాలన్నారు. ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు విద్యుత్‌ సబ్సిడీపై త్వరలోనే ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు

కాలువలు, డ్రెయిన్ల పూడిక తొలగింపు చేపట్టాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ కోరారు. ఎస్‌సీపీసీ చైర్‌పర్సన్‌ పీతల సుజాత స్కూల్స్‌ విలీన సమస్యను సభ దృష్టికి తీసుకువచ్చారు.

డీడీఆర్‌సీ సమావేశం అనంతరం కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా విద్యుత్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పీఎం సూర్యఘర్‌, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుకు స్థలాల గుర్తింపు, ప్రభుత్వ భవనాలపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో సబ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తదితర అంశాలపై సమీక్షించారు.

సమావేశంలో పీఏసీ చైర్మన్‌ పులపర్తి రామాంజ నేయులు, జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

డ్రోన్‌ సాంకేతికను ప్రోత్సహించాలి

మంత్రి నిమ్మల రామానాయుడు

వ్యవసాయ సాగులో డ్రోన్‌ టెక్నాలజీని ప్రోత్సహిం చాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారు లకు సూచించారు. రైతులకు 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లను అందించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపా రు. ఎమ్మెల్యేలతో మాట్లాడి అవసరమైన పనులను చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యానికి మించి లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలుకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వాసుపత్రులలో నిపుణుల కొరత

కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

ప్రభుత్వ ఆసుపత్రులలో అధునాతన పరికరాలు ఉన్నప్పటికి టెక్నీషియన్ల కొరత ఉందని కేంద్ర మం త్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ప్రభుత్వా సుపత్రి సమస్యలు తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మె ల్యేలు సభ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటా మన్నారు. భీమవరం పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైందని, అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ఉద్యాన పంటలు ప్రోత్సహించాలి

ఉద్యానవన పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ సబ్సిడీపై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలి. కాలువలు, డ్రెయిన్ల పూడికతో నరసాపు రం ప్రాంతంలో సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. సముద్రపు నీరు ఎగదన్నుతుంది. ఈస్ట్‌, వెస్ట్‌ కుక్కులేరు షట్టర్ల సమస్య పరిష్కరించాలి.

– బొమ్మిడి నాయకర్‌, ఎమ్మెల్యే, నరసాపురం

మత్స్స పరిశోధన కేంద్రం నిరుపయోగం

ఉండిలో నిర్మించిన ఫిషరీస్‌ రీసెర్చి స్టేషన్‌ వినియోగంలోనికి రాలేదు. రీసెర్చి స్టేషన్‌లో విలువైన పరికరాలు పాడవుతున్నాయి. రైతులకు ప్రయోజనం చేకూర్చే పరిశోధనలు ఇక్కడ జరగాల్సి ఉంది.

– మంతెన రామరాజు, చైర్మన్‌, ఏపీఐఐసీ

దివ్యాంగుల పాట్లు

దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలనకు విశాఖ, రాజమ హేంద్రవరం వెళ్లాల్సి వస్తుంది. అంత దూరం వెళ్లిరావడానికి దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నా రు. అధికారులు చర్యలు తీసుకోవాలి.

– ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్యే, తణుకు

Updated Date - May 08 , 2025 | 12:40 AM