తవ్వేస్తాం..
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:46 AM
నిన్నటి వరకు ఎలాంటి అనుమతులు లేకున్నా చాటుమాటుగా అక్రమ మట్టి తోలకాలు సాగిస్తున్న నూజివీడులోని మట్టి మాఫియా మంగళవారం రాత్రి నుంచి అడ్డొస్తే తొక్కించే స్తామంటూ బెదిరింపులకు దిగింది.
మీడియా రాకతో ఎక్కడి మట్టి అక్కడే..
పొంతన లేని సమాధానాలు చెప్పి పరార్
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు..
మీడియా దృష్టికి తెచ్చిన హనుమంతులగూడెం ప్రజలు
నూజివీడు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): నిన్నటి వరకు ఎలాంటి అనుమతులు లేకున్నా చాటుమాటుగా అక్రమ మట్టి తోలకాలు సాగిస్తున్న నూజివీడులోని మట్టి మాఫియా మంగళవారం రాత్రి నుంచి అడ్డొస్తే తొక్కించే స్తామంటూ బెదిరింపులకు దిగింది. ఇలాంటి సంస్కృతి నూజివీడులో ఇంత వరకు లేదు. నూజివీడు మండలం హనుమంతులగూడెం లో మంగళవారం రాత్రి మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామ శివారులోని బి ఫామ్ అటవీ భూమి వున్న ప్రాంతం నుంచి మట్టితో టిప్పర్లు గ్రామం మధ్య నుంచి వస్తుండగా గ్రామస్తులు ఆ టిప్పర్లు రాష్ట్ర రహదారిపైకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామస్తులు అక్రమ మట్టి రవాణా చేస్తున్న వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెచ్చిపోయిన మట్టి మాఫి యా అడ్డు తప్పుకోకపోతే తొక్కించేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు నూజివీడు మీడియాకు సమాచారం అందించారు. మీడియా రాక ను గమనించిన మాఫియా వాహనాలను వెనక్కి తీసుకువెళ్లి తవ్వినచోటే మట్టిని పోసి ఖాళీ టిప్పర్లతో వెళ్లిపోయారు. గ్రామంలో ధ్వంసమైన రహదారుల గోతులను పూడ్చడానికి మట్టి తోలామని ఒకసారి, రైతు తన పొలంలో వున్న మట్టి దిబ్బను సరిచేయించ టానికి తమను పిలవడంతో సదరు మట్టిని సరి చేస్తున్నామని మరోసారి పొంతన లేని సమాధానాలను అక్రమ మట్టి తోలకందారులు మీడియాకు తెలిపారు. గ్రామంలో ధ్వంసమైన మట్టి రహదారులను సరి చేయ డానికి టిప్పర్లు మట్టితో రాష్ట్ర రహదారిపైకి రావాల్సిన అవసరం ఏమిటో అన్న ప్రశ్నకు వారి నుంచి సమా ధానం రాలేదు. నియోజకవర్గంలో అధికార పార్టీ చోటా మోటా నాయకుల ఆధ్వర్యంలో ఈ అక్రమాలు సాగు తున్నాయి. ఆగిరిపల్లి మండలంలో కనసనపల్లి, పోత వరప్పాడు గ్రామాల్లో బి ఫారం పట్టా భూములను స్థానిక నాయకులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మైనింగ్ తెరవడానికి రంగం సిద్ధం చేశారు. నూజి వీడు, ఆగిరిపల్లి మండలాల్లో పలు గ్రామాలలో రాత్రి వేళ అక్రమ మైనింగ్ ఇప్పటికే జరుగుతూనే ఉంది. అధికారులకు తెలిసినా కన్నెత్తి చూడటం లేదు.