Share News

త్వరలోనే పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:27 AM

మాకు గృహాలు మంజూరు చేయాలి. గత టీడీపీ ప్రభుత్వ హ యాంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇప్పించాలి. కనీసం మంచినీళ్లు కూడా లేని పలు కాలనీల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలి’ అంటూ జిల్లావ్యాప్తంగా పలు వురు జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు.

 త్వరలోనే పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం
జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.సత్యనారాయణ

ఏలూరుసిటీ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి):మాకు గృహాలు మంజూరు చేయాలి. గత టీడీపీ ప్రభుత్వ హ యాంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇప్పించాలి. కనీసం మంచినీళ్లు కూడా లేని పలు కాలనీల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలి’ అంటూ జిల్లావ్యాప్తంగా పలు వురు జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి నిర్వహంచిన ‘ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమంలో గృహ నిర్మాణ సమస్యలపై ప్రజలు పలు సమస్యలను వివరించారు. వీటిపై పీడీ వారి ఆధార్‌ నెంబరు ఆధారంగా ఆన్‌లైన్‌లో పరిశీలించి పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. త్వరలోనే పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. ఆయన దృష్టికి ప్రజలు తీసుకుని వచ్చిన ప్రధాన సమస్యలు..

బిల్లులు పెండింగ్‌

ఇల్లు నిర్మించుకున్నాం. బిల్లు రూ.19 వేలు మాత్రమే పడింది. మిగిలినవి రాలేదు.

– పెరుగుమాళ్ళు సామ్రాజ్యం, అప్పన్నవీడు

2019లో కట్టుకున్న ఇంటికి బిల్లు రాలేదు. మా కట్టుకున్న వారికి వచ్చాయి.

– మునీషా, చింతలపూడి

2019లో నిర్మించిన ఇంటికి బిల్లులు రెండుసార్లు వచ్చాయి. మిగిలిన రాలేదు

– కోటా శేషు, చాట్రాయి

2017–18లో కట్టిన ఇంటికి రెండు విడతలుగా రూ.44 వేలు బిల్లు చెల్లించారు. మిగిలిన రావాలి.

– సొంగా రవి, ధర్మాజిగూడెం

గతంలో ఇల్లు నిర్మించినా బిల్లులు రాలేదు. కొత్త ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేశాం.

– చిల్లా వెంకటేశ్వరరావు, లక్కవరం

2019లో నిర్మించుకున్న ఇంటికి బిల్లులు రాలేదు.

–సీహెచ్‌ సుబ్బరావమ్మ, గురవాయిపాలెం

2014–19లో చింతలపూడి మండలంలో నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు రాలేదు. కొత్తగా కాలనీలు ఏర్పాటు చేయాలి.

– బాబు, చింతలపూడి

ఇల్లు నిర్మించుకున్నా ఒక బిల్లు మాత్రమే పడింది.

– ప్రొద్దుటూరి వెంకన్న, చాట్రాయి

2016–17లో ఇల్లు నిర్మించుకున్నాం. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

– గంధం శ్రీనివాసరావు, శెట్టివారిగూడెం

పీడీ : ఎన్టీఆర్‌ హౌసింగ్‌లో పెండింగ్‌ బిల్లులు చెల్లి స్తున్నాం. ఇప్పటికే ఇంటింటికీ సర్వే జరిగింది. బ్యాంకు ఖాతా పరిశీలన కోసం ఒక రూపాయి జమ చేశారు. త్వరలో పెండింగ్‌ బిల్లులు చెల్లింపు జరుగుతుంది. మీ సమస్య పరిష్కారం అవుతుంది.

2018–19లో నిర్మించుకున్న ఇంటి బిల్లులు రాలేదు.

– నిమ్మల శ్రీదేవి, లక్కవరం

పీడీ : మీకు పూర్తిస్థాయిలో బిల్లులు వచ్చాయి. పెండింగ్‌ లేదు.

ఇంటి ఫౌండేషన్‌ వేశాం. ఒక బిల్లు వచ్చింది. సిమెంట్‌, ఐరన్‌ ఇచ్చారు. ఆపై పురోగతి లేదు.

– బి.వీరాస్వామి, చింతంపల్లి

పీడీ : హౌసింగ్‌ ఏఈని కలవండి.

కొత్తగా ఇల్లు కట్టుకోవాలని దరఖాస్తు చేశాం. ఇంటి నిర్మాణం మొదలు పెట్టవచ్చా ?

– సత్తిశెట్టి లక్ష్మి, లక్కవరం

పీడీ : ఇప్పటికే మీ దరఖాస్తు రిజిస్టరు అయింది. మంజూరైన తర్వాత ఇంటి నిర్మాణం చేపట్టండి.

సౌకర్యాలు కల్పించండి..

నాగిరెడ్డిగూడెంలో వైఎస్‌ఆర్‌ కాలనీలు నిర్మించారు. కనీసం మంచినీటి సరఫరా జరగడం లేదు. కాలనీకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

– అశోక్‌, చింతలపూడి

పీడీ : జల్‌జీవన్‌ మిషన్‌లో ఆ కాలనీలకు మంచినీటి పైప్‌లైన్లు వేశారు. మంచినీటి సమస్య పరిష్కారానికి ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో మాట్లాడతాం.

గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన హౌసింగ్‌ కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షం వస్తే కాలనీలు మునిగిపోతున్నాయి.

– ఎం.రవి, ముదినేపల్లి

పీడీ : ఈ సమస్య మంత్రి గారి దృష్టికి వచ్చింది. త్వరలోనే పరిష్కారం అవుతుంది.

ఇళ్లు.. స్థలాలు కావాలి

మాకు ఇంటి స్థలం లేదు. ఇప్పించగలరు.

– కేతినేని రమాదేవి, చింతలపూడి

పీడీ : ఇంటి స్థలం కోసం తహసీల్దార్‌ గారిని, లేదా సచివాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

కొత్త ఇల్లును మంజూరు చేయగలరు.

– ఎస్‌ పార్వతి, దెందులూరు

కొత్త ఇంటికి దరఖాస్తు చేశాం. ఎప్పుడు మంజూరు అవుతుంది.

– తమ్మిశెట్టి రాటాలు, వేగివాడ

కొత్త ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇంతవరకు మంజూరు కాలేదు.

– షేక్‌ నాగూర్‌బీ, దెందులూరు

మేం ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మంజూరు చేయగలరు.

– ఎస్‌.త్రిమూర్తులు, కైకరం

కొత్త ఇంటికి రుణం కోసం దరఖాస్తు చేశాం. మంజూరు చేయించండి.

– కందుకూరి నాగమణి, దెందులూరు

పీడీ : మీ దరఖాస్తులు అందాయి. రిజిస్టర్‌ కూడా అయ్యాయి. త్వరలోనే మంజూరవుతాయి. ఆ తర్వాతే నిర్మాణం చేపట్టండి.

లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో పీఎంఏవై అర్బన్‌, గ్రామీణ్‌, జన్‌మన్‌ తదితర పథకాల కింద 12,345 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకు 10,655 నిర్మాణాలు పూర్తి చేశాం. కొత్తగా ఇళ్లు కావాలని 31,151 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతగా పీఎంఏవై అర్బన్‌ 2.0 కింద 1,604 ఇళ్లు మంజూరయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు గృహ నిర్మాణాలలో అదనపు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.70 వేలు అదనంగా ఇస్తుంది. ఇందుకు రూ.9 కోట్ల 68 లక్షలు కేటాయించింది. పీఎంఏవై అర్బన్‌, గ్రామీణ్‌ పథకాలకు ఇళ్ల నిర్మాణం యూనిట్‌ వ్యయం రూ.లక్షా 80 వేలు, జన్‌మన్‌ పథకం యూనిట్‌ వ్యయం రూ.2 లక్షల 39 వేలు. జిల్లాలో మంజూరైన 82,626 ఇళ్లకు 45,270 పూర్తయ్యాయి. 759 కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 2026 మార్చి నాటికి మొత్తం ఇవి పూర్తి కావాలి.

Updated Date - Oct 11 , 2025 | 01:27 AM