Share News

ఈ నీరు తాగలేం..!

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:57 PM

ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో రక్షిత నీటి పథకాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రధానంగా ఫిల్టర్‌ బెడ్‌లు పని చేయడం లేదు.

ఈ నీరు తాగలేం..!
కైకలూరు ఫిల్టర్‌బెడ్స్‌లో దట్టంగా మొలిచిన జమ్ము

రక్షిత నీటి పథకాలు అస్తవ్యస్తం

పడకేసిన ఫిల్టర్‌ బెడ్‌లు.. పగిలిన పైపులైన్లు

ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో రక్షిత నీటి పథకాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రధానంగా ఫిల్టర్‌ బెడ్‌లు పని చేయడం లేదు. చాలా చోట్ల క్లోరినేషన్‌ చేయడం లేదు. పలుచోట్ల పైపు లైన్లు పగిలిపోయాయి. కుళాయిల నుంచి కలుషిత నీరు సరఫరా చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిల్టర్‌ బెడ్‌ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఏళ్ల తరబడి ఇసుక మార్చడం లేదు. మరమ్మతులకు గురైన బెడ్‌లను గాలికొదిలేశారు. తాగునీరు పసర్లు తేలితే, ఫిల్టర్‌ బెడ్‌లలో దట్టంగా పెరిగిన గడ్డి పాలకులు, అధికారుల నిర్లక్ష్యాన్ని పట్టిచూపుతోంది. పైపులైన్‌ లీకేజీలతో నీరు వృథాగా పోతుంది. మరోవైపు సామాన్యులు తాగే కొద్దిపాటి నీరు మురుగుతో కలుషితమవుతోంది.

ఏలూరులో కలుషిత నీరు

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఏలూరు కార్పొరేషన్‌ విలీన గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడు తున్నారు. శనివారపుపేట, తంగెళ్లమూడి, పోణంగి, చొది మెళ్ల, కొమడవోలు, సత్రంపా డు, వెంకటాపురం గ్రామాల్లో సుమారు 80వేల మంది నివ సిస్తున్నారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లో సరిగా ఫిల్టరైజేష న్‌ చేయకపోవడం వలన తాగునీరు కలుషితమై దుర్వాసన వస్తున్నాయ ని ప్రజలు వాపోతున్నారు. బోరు నీటిని మోటార్ల ద్వారా ఓవర్‌హెడ్‌ ట్యాంకుకు పంపి బ్లీచింగ్‌చల్లి సరఫరా చేయడంతో పరిశుభ్రమైన నీరు రావడం లేదు. అక్కడక్కడ పైపులైన్ల లీకేజీ కారణంగా డ్రెయినేజీ మురు గు కలుస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో సుమారు 2.5లక్షల మంది జనాభాకు రెండు పూటల తాగునీరు సరఫరా అవుతోం ది. పంపుల చెరువు వద్ద వాటర్‌ను ఫిల్టర్‌ చేసి సరఫరా చేస్తున్నారు. నగరంలో తాగునీటిపై ఫిర్యాదులు లేవు. దెందులూరు వద్ద 110 ఎకరాల పంపుల చెరువు నుంచి గోదావరి వాటర్‌, నగరంలోని పంపుల చెరువు నుంచి కృష్ణావాటర్‌కు ప్రతీరోజు రెండు పూటల తాగునీరు సరఫరా చేస్తున్నారు. నగరంలో నూతన పైపులైన్‌తో లీకేజీ సమస్యలు లేవు.

చింతలపూడిలో రక్షిత నీటి సరఫరా అధ్వానం

చింతలపూడి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలో 19 పం చాయతీలు, చింతలపూడి నగర పంచాయతీలో రక్షిత మంచినీటి సర ఫరా పథకాలు ఉన్నాయి. చింతలపూడి పట్టణం మినహా మిగిలిన గ్రామాల్లో తాగునీటి సరఫరా అధ్వానంగా ఉంది. 24 గంటల విద్యుత్‌ సరఫరాతో మోటార్లు ఆన్‌చేసి రాత్రి వరకు సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో మంచినీరు వృథా అవుతోంది. పంచాయతీల్లో కార్యదర్శులు లేకపోవడమే. సచివాలయ కార్యదర్శులు అజమాయిషీ నీటి సరఫరాపై పర్యవేక్షణ కొరవడింది. చాలా చోట్ల వీధి కుళాయిలకు ప్లాట్‌ఫారాలు లేవు. మండలంలో సుమారు 60 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి. రేచర్ల తండాలో ట్యాంకు లీకేజీ కావడంతో మోటారు నేరుగా కుళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. లింగగూడెం, ఊట సముద్రం గ్రామా ల్లో పైపులైన్లు లీకేజీలున్నాయి. మరమ్మతులు చేయకపోవడం వలన మురుగునీరు పైపుల్లోకి పోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. చింతల పూడిలో సబ్‌ డివిజన్‌ కార్యాలయం ఉండేది. గత ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్‌ డీఈ శాఖలను నూజివీడులో కలిపింది. మండల ఏఈ ఉన్నా లింగపాలెం మండల ఇన్‌చార్జి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. సబ్‌ డివిజన్‌లు ఎత్తివేయడం, గ్రామీణ నీటిసరఫ రాపై అజమాయిషి లేకపోవడం, ట్యాంకులు పరిశుభ్రత లేకపోవడం జరుగుతుంది. సీజన్‌ మారినప్పుడల్లా ఆరోగ్య శాఖ గ్రామీణ సరఫరా శాఖలు పర్యవేక్షించి ట్యాంకులను క్లీనింగ్‌ చేయాల్సి ఉంది. అవి కూడా చేయకపోవడం రక్షిత నీరు అందడం లేదు.

ఆకివీడు పైపులైన్లకు మరమ్మతులు

ఆకివీడు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలో 50 వేల జనాభాకు ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం 18 లక్షల లీటర్ల తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రధాన పైపు లైన్‌ ఏర్పాటుచేసి 60 ఏళ్లు కావడంతో తరచు లీకేజీ సమస్యల తలెత్తుతోంది. భుజబలరాయుడు, భుజబలరాయుడు స్టోరేజ్‌ ట్యాంకు మంచినీటి చెరువు ఫిల్టర్‌ బెడ్లలో ఇసుక మార్చకపోవడంతో నీరు శుద్ధి కావడం లేదు. పైపులైన్‌ లీకేజీతో మురుగుతో తాగునీరు కలుషితమవుతోంది. అదనంగా ఫిల్టర్‌ బెడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం సంతమార్కెట్‌, శాంతినగర్‌, ధర్మాపురం ట్యాంకులు శిఽథిలావస్థకు చేరుకోవడంతో తాగునీరు వృఽథా అవుతోంది. మంచినీటి చెరువులకు అవుట్‌ లెట్‌లు లేవు, జనరేటర్లు లేకపోవడంతో కరెంటు ఉంటేనే తాగునీరు సరఫరా చేస్తుంటారు. పెద్ద, చిన్న పల్లె వీధులు, తెలగపాముల వీధికి, రైల్వేస్టేషన్‌ ఎదురుగా, సమతానగర్‌, ఎఫ్‌సీఐ దగ్గరకు ఏడాది పొడవునా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. పట్టణంలో సుమారు 80 శాతం జనాభా బయట నీటిని కొనుగోలు చేసుకుంటే, కొందరు ఇళ్లలో ఫిల్టర్‌ వేయించుకొని నీటిని తాగుతున్నారు. భుజబలరాయుడు చెరువు దగ్గర కుండీ శ్లాబ్‌ పగిలిపోయింది. సమస్యలు పరిష్కరించాలని పాలకవర్గం, అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.

లింగపాలెం పైపులైన్‌కు పగుళ్లు

లింగపాలెం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలో పలు గ్రామాలలో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన తాగు నీరందక, కలుషిత నీరు తాగలేక ప్రజ లు ఇబ్బందులు పడుతున్నా రు. కొన్నిచోట్ల ట్యాంకులు సరిగా లేకపోవడం, పైపులైన్‌ మరమ్మతులతో తాగునీటి సరఫరాలో తరచూ ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. అనపనేనివారిగూడెంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సమీపంలోని పుప్పాలవారిగూడెం నుంచి పంట పొలాల మీదుగా పైపులైన్‌ను వేసి తాగునీరందిస్తున్నారు. పంటల సమయంలో రైతులు దున్నుకునే సమయంలో ప్రతిసారి పైపులు పగిలిపోతుండడం తో కలుషిత నీరు వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఒక్కోసారి పంటపొలాలలో రసాయన ఎరువులు కలిసిన నీరు వస్తుండడంతో అనారోగ్యాల పాలవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. తరచూ పైపులైన్‌లు పగిలిపోతుండటంలో తాగునీటికి, కనీస అవస రాలకు నీరందక ఇబ్బందులు పడుతున్నారు. పైప్‌లైన్‌ను మార్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ధర్మాజీగూడెం, టీసీహెచ్‌ఆర్‌పాలెం వాటర్‌ ట్యాంక్‌లు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. సమీపంలో నిత్యం పిల్లలు, గ్రామ స్తులు తిరుగుతుంటారని ఈ ట్యాంకులు ఎప్పుడు కూలుతాయో, ఎటువంటి ప్రమాధం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.

ఫిల్టర్‌ బెడ్స్‌లో తూడు.. పిచ్చి మొక్కలు

కైకలూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రక్షిత నీటి పథకాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వైసీపీ పాలనలో రక్షిత నీటి పథ కాలకు ఒక్క ఫిల్టర్‌బెడ్‌ నిర్మాణం చేయకపోగా ఉన్నవాటిని మరమ్మతు చేయలేదు. దీంతో ప్రజలకు కాలువల్లో నీటినే నేరుగా సరఫరా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ నిధుల లేమి వెన్నాడుతోంది. కైకలూరు మండలంలో సుమారు 18 గ్రామాల్లో ఫిల్టర్‌బెడ్స్‌ పడకేశాయి. కైకలూరులో 6 ఫిల్టర్‌బెడ్స్‌ నోచుకోకపోవడంతో మరుగున పడ్డాయి. రూ.1.9 లక్షలతో నిర్మాణం చేసిన ర్యాపిడ్‌ శాండ్‌ఫిల్టర్‌ పనిచేయకపోవడంతో నేరు గా నీటిని విడుదల చేస్తున్నారు. ఆటపాక, భుజబలపట్నం, పల్లెవాడ, ఆల పాడు, సీతనపల్లి, వరహాపట్నం, రాచపట్నం, గోపవరం తదితర గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. ఫిల్టర్‌బెడ్స్‌ను వినియోగించకపోవడంతో వాటిలో పిచ్చిమొక్కలు, జమ్ము దట్టంగా పెరిగిపోయాయి. స్థానికంగా గ్రామ పంచాయతీ అధికారులు సైతం కనీస మరమ్మతులు నిర్వహించేందుకు సముఖత చూపడం లేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించినా నిధులు మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో ప్రజలు శుద్ధి కాని జలాలనే వినియోగించుకోవాల్సి వస్తోంది.

Updated Date - Sep 19 , 2025 | 11:57 PM