Share News

విజన్‌ – 2047కు శ్రీకారం

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:37 AM

వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా విజన్‌–2047 ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టింది.

విజన్‌ – 2047కు శ్రీకారం

ముందుకు తీసుకువెళ్లాల్సింది ప్రజా ప్రతినిధులు.. అధికారులే

నియోజకవర్గాల వారీగా కార్యాచరణ

తలసరి ఆదాయం పెంపే లక్ష్యం

ఆక్వా, వ్యవసాయం, పారిశ్రామిక, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం

నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి.. ఐదుగురు సచివాలయ సిబ్బంది

జిల్లా యూనిట్‌కు ఇన్‌చార్జ్‌ మంత్రి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే చైర్మన్‌

వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడిన సీఎం చంద్రబాబునాయుడు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా విజన్‌–2047 ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టింది. జిల్లాలో తలసరి ఆదాయం పెం పుదల లక్ష్యంగా విజన్‌ ప్రణాళిక రూపొందించింది. ఏలూరు జిల్లాకంటే పశ్చిమ గోదావరి తలసరి ఆదా యంలో వెనుకబడింది. ఇక్కడ ఏడాది తలసరి ఆదాయం రూ.1.65 లక్షలు కాగా, ఏలూరు జిల్లాలో రూ.2 లక్షల వరకు ఉంది. మెట్టలో ఇటీవల పామా యిల్‌తోపాటు ఇతర పంటలు వృద్ధిలోకి వచ్చాయి. కాని పశ్చిమ ఆక్వా, వరి రంగాలపైనే ఆధారపడింది. పరిశ్రమలు అంతగా లేవు. ఆక్వా కూడా ఇటీవల తిరోగమనంలో పయనిస్తోంది. వీటిని అఽధిగమించ డంతోపాటు ఆక్వా, ఉద్యాన సాగు, పారిశ్రామిక, ఉపాధి రంగాలు ప్రాధాన్యం ఇచ్చేలా విజన్‌–2047 రూపకల్పన చేశారు. విద్య, వైద్య రంగాల్లోనూ జిల్లా వృద్ధికి కార్యాచరణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖల నుంచి సమాచారాన్ని సేకరించారు. విజన్‌– 47కు అనుగుణంగా సమాచారాన్ని సేకరించేందుకు జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమం అమలుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. వీరితోపాటు ప్రతి నియో జకవర్గంలోనూ ఐదుగురు సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రత్యేక సెల్‌ ఉంటుంది. ఐదుగురు సచివాలయ సిబ్బంది ప్రతిరోజు నియోజ కవర్గాల్లో వివరాలను సేకరించి ప్రత్యేక అధికారు లకు సమాచారం ఇస్తారు. వీరిచ్చే నివేదికలపై సమీక్షలు నిర్వహించి తదుపరి కార్యాచరణకు మార్గ నిర్దేశం చేస్తారు.

భీమవరంటౌన్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘నియోజ కవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్యాలయం లేదు. ఇప్పుడు విజన్‌–2047 యాక్షన్‌ ప్లాన్‌ యూని ట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరింది. జిల్లా, నియోజక వర్గంలో ఈ యూనిట్‌ కార్యాలయాలు పూర్తిస్థాయి లో పనిచేస్తాయి. ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలతోపాటు తొమ్మిది మంది టీమ్‌ను ఇస్తు న్నాం. విజన్‌ అమలును తర్వాత స్థాయికి తీసుకు వెళ్లాల్సింది ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికా రులే’ అని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం సచివాలయం నుంచి 26 జిల్లాలు, 175 నియోజక వర్గాల్లో విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాలయా లను వర్చువల్‌గా ప్రారంభించి, వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజా ప్రతినిధులు, అధికారులతో విజన్‌ అమలుపై చర్చించారు. భీమవరం కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ నాగరాణి, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, వివి ధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘జిల్లా యూనిట్‌కు ఇన్‌ఛార్జి మంత్రి చైర్మన్‌, ఎంపీ వైస్‌ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌, సీపీవో కన్వీనర్‌, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులు. నియో జకవర్గ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌కు ఎమ్మెల్యే అధ్యక్షు డు. నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మునిసిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్‌, ఆర్డీవో, సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు సభ్యులు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - Jun 10 , 2025 | 12:37 AM