Share News

పొగాకు అ‘ధర’హో

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:57 PM

వర్జీ నియా పొగాకు ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు ధర రూ.411 ఆల్‌ టైమ్‌ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది.

పొగాకు అ‘ధర’హో

వర్జీనియా కిలో రూ.418

ఆల్‌టైమ్‌ రికార్డు ధర

రైతుల మోములో సంతోషం

మరో 45 రోజులు కొనసాగనున్న వేలం

ఇదే ధర కొనసాగాలని ఆశ

తక్కువ ధరకు అమ్మిన రైతుల్లో నిరాశ

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు ధర రూ.411 ఆల్‌ టైమ్‌ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యల గూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవర పల్లిలో రూ.416 ఽధరలు పలికాయి. గత ఏడాది సంవ త్సరం వారం రోజుల్లో వేలం ముగుస్తుందనగా రూ.411 ధర రాగా ఈ సంవత్సరం మరో 45 రోజులు వేలం సమయం ఉండగా ధర రూ.418 చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు క్వాలిటీ పొగా కును ఇప్పటికే రైతులు తక్కువ ధరకే అమ్ముకున్నారు. మిగిలిన క్వాలిటీ పొగాకు మాత్రమే అధిక ధరలకు అమ్ముకునే పరిస్థితులున్నాయి. రైతులు అదనంగా పండించిన పొగాకును ప్రస్తుతం ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో ఉన్న ఐదు వేలం కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకును నామ మాత్రపు పెనాల్టీతో అమ్ముకునే వెసులుబాటు కల్పించ డం, ఇప్పుడు ధర పెరగడంతో రైతులు ముఖాల్లో సంతోషం కనబడుతుంది. ప్రస్తుతం ఉన్న రూ.418 ధర వేలం ముగిసే వరకు ఉంటుందా అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే ధరలు నిలక డగా ఉంటే చాలా వరకు రైతులు తమ కష్టాల నుంచి బయట పడే అవకాశాలున్నాయి. అయితే లో గ్రేడు పొగాకు ధరలు రూ.200 మించి పెరగడం లేదు.

రైతులకు సంతోషం

పొగాకు వేలంలో శుక్రవారం రూ.418 ధర రైతులకు సంతోషం కలిగించింది. ఈ ధర నిలకడగా ఉంటే రైతులకు లాభం చేకూరుతుంది. గత ఏడాది వేలం ముగిసే చివరి సమయంలో ధర రూ.411 పెంచారు. దాని వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం లేదు. 45 రోజులు వేలం గడువు ఉండగా రూ.418 ధర పలక డం రైతులకు చాలా వరకు మేలు జరుగుతుంది. కూలీలకు కూడా కూలీ రేట్లు పెరుగుతాయి. రైతులు అధికంగా పండించిన పొగాకును కూడా అతి తక్కువ పెనాల్టీతో అమ్ముకునే అవకాశం కల్పించడం శుభపరిణామం.

– కాకర్ల వివేకానంద, రైతు సంఘం అధ్యక్షుడు, కొయ్యలగూడెం

Updated Date - Sep 12 , 2025 | 11:57 PM