బదిలీ.. బంతాట!
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:39 AM
సచివాలయ ఉద్యో గుల బదిలల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ, విద్యా సహాయకులు, మహిళా సంరక్షణ కార్యదర్శుల ఆందోళన
ఏలూరు రూరల్, జూలై 7(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యో గుల బదిలల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. బదిలీలకు దరఖాస్తు చేయని వారి స్థానంలో చేరాలని కొందరికి, ఒకే ప్రదేశంలో మూడు ఆప్షన్లతో ఇద్దరికి పోస్టింగ్ ఇవ్వడంతో ఉద్యోగులంతా తీవ్ర అసహ నం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు బదిలీల వ్యవహరాలలో తల దూర్చడంతో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే బదిలీల వ్యవహరాన్ని చక్కబెడుతూ, తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. దివ్యాంగులు, స్పౌజ్ నిబంధనలను పట్టించుకోలేదని, రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని సంక్షేమ, విద్యా సహాయకులు సోమవారం ఆందోళన బాట పట్టారు. ఏలూరులో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు లెక్క చేయకుండా సోష ల్ వెల్ఫేర్ శాఖ బదిలీలు నిర్వహించిందని మండిపడ్డారు. బదిలీల కు దరఖాస్తు చేసుకోని వారి స్థానంలో కూడా పోస్టింగ్ ఆర్డర్ ఇ చ్చారని, మూడు ఆప్షన్లో సంబంధం లేకుండా సుధీర్ఘ ప్రాంతాలకు బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే ప్రదేశంలో మూడు ఆప్షన్లు ద్వారా ఇద్దరికి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం ప్రశ్నించారు. రూరల్ వారికి అర్బన్‌లో బదిలీ చేశారని, తక్షణం రీ కౌన్సెలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
మహిళా పోలీసులది అదే దారి..
మహిళా సంరక్షణ కార్యదర్శులు పలువురు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీల్లో పారదర్శకత లేదన్నారు. వార్డు పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క వార్డుకు, మండల పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క మండలానికి బదిలీ చేయాలర్ర నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. పంచాయతీల్లో పనిచేస్తున్న వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఏఎస్పీకి వినతి
ఏలూరు క్రైం: బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎస్పీ కార్యాలయం వద్ద ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. 1,2,3 మెరిట్ లిస్టుల ప్రకారం కౌన్సెలింగ్ జరగలేదన్నారు. సచివాల య ఉద్యోగాల్లో 15 మార్కులు అదనంగా జత చేశాక విధుల్లో చేరి న వారికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. హడావుడిగా ఆప్షన్ పత్రాలు ఇచ్చారని, వారం గడిచాక బదిలీల జాబితా విడుదల చేశారన్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి మెరిట్ ప్రకారం ట్రాన్స్‌ఫర్ చేయలేదని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.