Share News

విలీన వివాదం

ABN , Publish Date - May 22 , 2025 | 12:11 AM

వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం మున్సిపాలిటీలను, విలీన గ్రామాలను వెంటాడుతోంది. ఏకపక్షంగా గ్రామాలను పట్టణాల్లో విలీనం చేయడంతో ఆర్థిక సంఘం నిధులకు గండిపడింది.

విలీన వివాదం

నిలిచిన ఆర్థిక సంఘం నిధులు

భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాలు, సమీప విలీన గ్రామాలకు సమస్య

ఎన్నికలు లేవు.. కోర్టు కేసులు తేలవు

ఆర్థిక ఇబ్బందులతో సిబ్బంది కటకట.. అభివృద్ధి ఆగుతోందంటూ ప్రజల ఆవేదన

వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం మున్సిపాలిటీలను, విలీన గ్రామాలను వెంటాడుతోంది. ఏకపక్షంగా గ్రామాలను పట్టణాల్లో విలీనం చేయడంతో ఆర్థిక సంఘం నిధులకు గండిపడింది. పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి ఆర్థిక సంఘ నిధులు మంజూరు కావడం లేదు. గతంలో ఇవేమీ పట్టింపు ఉండేవి కావు. నీతి అయోగ్‌ తీసుకున్న నిర్ణయంతో స్థానిక సంస్థల్లో పాలకవర్గాలను తప్పనిసరి చేసింది. అదే ఇప్పుడు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఇబ్బందికరంగా ఉంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాల కొల్లు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. వీటి లో విలీన గ్రామాలకు ఎన్నికలు జరగలేదు. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఇతర గ్రామా ల్లో అభివృద్ధి జరుగుతుంటే విలీన గ్రామాలు నిధులు లేకపోవడంతో విలవిలలాడుతున్నాయి. విలీనానికి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతో మున్సిపా లిటీల్లోనూ ఎన్నికలు నిర్వహించలేదు. ఇలా పట్టణాల కు జిల్లాలో ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. రెండేళ్లుగా నుంచి ఇదే సమస్య వెంటాడుతోంది. నిధుల లభ్యతలేక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.

నాలుగు గ్రామాలకు చుక్కెదురు

తాడేపల్లిగూడెంలో కొండ్రుప్రోలు, ఎల్‌.అగ్రహారం, కుంచనపల్లి, ప్రత్తిపాడు, పడాల పంచాయతీలను విలీ నం చేశారు. వీటన్నింటికీ ఆస్తి పన్ను తక్కువగా ఉంటోంది. సొంత ఆదాయం లేదు. చెరువులు లేవు. కేవలం ఆర్థిక సంఘం నిధులతోనే కాలం వెళ్లదీస్తున్నా రు. ఎన్నికలు లేకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. ఉపాధి నిధులను మాత్రం ప్రత్యేక జీవో విడుదల చేసి మంజూరుచేశారు. లేదంటే నిధుల కోసం మరింతగా అల్లాడిపోయేవి. ఆర్థిక సంఘం నిధులొస్తే మంచినీటి వసతులు, డ్రైనేజీ, పారిశుధ్య వ్యవస్థల మెరుగుదలకు వినియోగిస్తారు. విలీన గ్రామాలకు అటువంటి అవకాశం లేకపోయింది.

పాలకొల్లులో మున్సిపాలిటీలో గొంతేరు, అడవిపా లెం, పూలపల్లి, భగ్గేశ్వరం, ఉలంపర్రు, పాలకొల్లు రూర ల్‌ పంచాయతీలను విలీనం చేయడంతో అక్కడా ఆర్థిక సంఘం నిధుల సమస్య వెంటాడుతోంది. నిధులు మంజూరుకాలేదు. విలీన సమస్యపై ప్రభుత్వ వర్గాలు దృష్టి పెట్టడం లేదు.

తణుకు రూటే వేరు

తణుకు పురపాలక సంఘంలో పైడిపర్రు, వెంకట్రా యపురం, వీరభద్రపురం పంచాయతీలను విలీనం చేశా రు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ప్రత్యేక సవరణ ద్వారా మున్సిపల్‌ ఎన్నికలను గతంలో నిర్వహించారు. విలీన పంచాయతీలకు వార్డు ఎన్నికలు చేపట్టారు. ఇప్పుటికీ ఆ గ్రామాల్లో మున్సిపాలిటీ నిధులను వెచ్చిస్తోంది. కానీ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో గత ఎన్నికలను నిర్వహించలేదు. మున్సిపల్‌ ఎన్నిక లేకపోవడంతో పట్టణానికి ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. విలీన గ్రామాలకు స్థాఽనిక సంస్థల ఎన్ని కలు నిర్వహించలేదు. ఆ గ్రామాలకు ఆర్థిక సంఘం మంజూరుకావడం లేదు. కానీ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తోంది. అదే మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించక పోవడంతో తణుకు పట్టణానికి ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. రెండు విధాలా ఇప్పుడు తణుకు మున్సిపాలిటీ నష్టపోతోంది. పాలకవర్గాలు లేకపోవడంతో భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాలకు ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. వీటిపై ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌ దృష్టి సారించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

భీమవరంలో కోర్టు వివాదాలు

భీమవరం పురపాలక సంఘ పరిధిలో చినఅమి రం, తాడేరు, రాయలం, కొవ్వాడ అన్నవరం గ్రామాల ను విలీనం చేశారు. గ్రామస్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విలీనం నిలిచిపోయింది. దీంతో ఆర్థిక సంఘం నిధులు మంజూరుకావడం లేదు. నీతి అయోగ్‌ మార్గదర్శకాలు ప్రకారం పాలకవర్గాలు ఉన్న పంచాయతీలకే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తారు. గతంలో సదరు నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు పంచాయతీ ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయి. ఖర్చు పెట్టుకోవడానికి వెసులుబాటు కల్పించారు. భీమవరంలో మూడు మేజర్‌ పంచాయ తీలను విలీనం చేశారు. చినఅమిరం, రాయలం గ్రామ పంచాయతీలకు ఆస్తిపన్ను రూపంలో కొంత సమకూరుతోంది. గత ఐదేళ్లలో నిధులు దుర్వినియో గం చేశారు. సిబ్బంది సొంత ఖాతాలకు మళ్లించారు. ఫలితంగా ఆ పంచాయతీల్లోనూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.

Updated Date - May 22 , 2025 | 12:11 AM