91.1 శాతం అర్జీలు పరిష్కారం
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:43 AM
జిల్లాలో పీజీఆర్‌ఎస్‌లో 13వే562 దరఖాస్తులు రాగా 91.1 శాతం మేర పరిష్కరించామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి భూ పరిపాలన కమిషనర్(సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మికి వివరించారు.
ఏలూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీజీఆర్‌ఎస్‌లో 13వే562 దరఖాస్తులు రాగా 91.1 శాతం మేర పరిష్కరించామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి భూ పరిపాలన కమిషనర్(సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మికి వివరించారు. సచివాలయం నుంచి పీజీఆర్‌ఎస్, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, సుమోటో క్యాస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, జిల్లాల విభజనపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీ క్షించారు. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 12,530 దరఖాస్తులను పీజీఆర్‌ఎస్‌లో పరిష్కరించామని, ప్రజల సంతృప్తి స్ధాయిని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. నిరుపేదలకు ఇళ్లపట్టాల పంపిణీలో భాగంగా జిల్లాలో 8,420 దరఖాస్తులు అందాయని, వాటిలో 2,341 మంది అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు.
పోలవరం పునరావాసాలకు 2,799 ఎకరాలు
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస కార్యక్ర మాలకు జిల్లాలో 2799.60 ఎకరాల భూమిని గుర్తిం చామని కలెక్టర్ వెట్రిసెల్వి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు తెలిపారు. సచివా లయం నుంచి ఆయన పోలవరం ప్రాజెక్టు, పునరావాస కార్యక్రమాలపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పునరావాస ప్యాకేజీలో 1743 ఎకరాల భూమి భూసేకరణ దశలో ఉందన్నారు.
ధాన్యం కొనుగోలులో ముందుండాలి
ఏలూరు సిటీ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి బుధవారం సాంకేతిక శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ సూచనలు ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, సాంకేతిక అంశాలను సిబ్బందికి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది కంటె లక్ష మెట్రిక్ టన్నుల అదనంగా సేకరించడం లక్ష్యం అన్నారు.