Share News

శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రం

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:18 AM

చినవెంకన్న క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీవారి ప్రసాదాలు, దర్శనాలు, ఆర్జిత సేవల టిక్కెట్ల ద్వారా శనివారం ఒక్కరోజే రూ.32 లక్షలు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తి తెలిపారు.

శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రం
శ్రీవారి అనివేటి మండప ప్రాంతంలో యాత్రికుల రద్దీ

20 వేల మంది పైబడి భక్తులు దర్శించినట్టు అంచనా

ఒక్కరోజే శ్రీవారి ఆదాయం రూ.32 లక్షలు

ద్వారకాతిరుమల, అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): చినవెంకన్న క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీవారి ప్రసాదాలు, దర్శనాలు, ఆర్జిత సేవల టిక్కెట్ల ద్వారా శనివారం ఒక్కరోజే రూ.32 లక్షలు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తి తెలిపారు. రెండో శనివారం కావడంతోపాటు శ్రీవారికి ఇష్టమైన రోజు అవడం వల్ల దాదాపు 20 వేల మందికి పైబడి యాత్రికులు క్షేత్రానికి చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ఐదు కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపో యింది. శ్రీవారి ఉచిత దర్శనానికి మూడు గంటల పైబడి సమయం పట్టింది. సాయంత్రం ఐదు గంటల నుంచి యాత్రికుల రద్దీ కాస్త తగ్గింది. దర్శనానంతరం భక్తులు శ్రీవారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Updated Date - Oct 12 , 2025 | 12:18 AM