దిగిరాని కూరగాయలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:21 AM
మార్కెట్లో కూరగా యల ధరల దిగిరానం టున్నాయి. గత మూడు వారాలుగా కూరగాయలు ధరలు భగ్గుమం టున్నాయి. కార్తీక మాసంతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుతో దిగుబడి తగ్గడం వంటి కారణాలతో కూరగాయల ధరలు తగ్గడం లేదు.
మహారాష్ట్ర నుంచి నాసిరకం ఉల్లి
క్వింటా రూ.1,300 నుంచి 1,800 మఽధ్యనే ..
కొద్దిగా తగ్గిన వంకాయ ధర
తాడేపల్లిగూడెం, నవం బరు 16(ఆంధ్ర జ్యోతి) :
మార్కెట్లో కూరగా యల ధరల దిగిరానం టున్నాయి. గత మూడు వారాలుగా కూరగాయలు ధరలు భగ్గుమం టున్నాయి. కార్తీక మాసంతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుతో దిగుబడి తగ్గడం వంటి కారణాలతో కూరగాయల ధరలు తగ్గడం లేదు. వంకాయ, కంద ధర మాత్రమే కొద్దిగా తగ్గింది. మిగిలిన కూరగాయల ధరలు తగ్గడం లేదు. బీరకాలు, బెండకాయలు, దొండకాయలు కిలో రూ.80కు విక్రయిస్తున్నారు. చిక్కుడు రూ.120, కాకరకాయ రూ.60, టమాటా లు రూ.50, క్యాప్సికం 120, వంకాయలు రూ.100, కంద రూ.60 పచ్చిమర్చి రూ.50, బీట్‌రూట్ రూ.80, క్యారెట్ రూ.80, మునగకా డలు రెండు రూ.25, అరటికాయలు రెండు రూ.20 చొప్పున విక్రయించారు.
మహారాష్ట్ర నుంచి 210 టన్నుల ఉల్లి..
తాడేపల్లిగూడెంలోని ఆదివారం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి 7 లారీలో సుమారు 210 టన్నుల ఉల్లి వచ్చింది. ఈ ఉల్లిని హోల్‌సేల్‌గా క్వింటా రూ.1300 నుంచి 1800 మధ్య విక్రయించారు. నాసిరకంగా ఉండడంతోపాటు నాణ్యత తక్కువగా ఉండడంతో ధర అంతగా రాలేదని వ్యాపారులు చెబుతున్నారు. మంచి నాణ్యత ఉన్న మహరాష్ట్ర ఉల్లికి క్వింటా రూ.1800 నుంచి రూ.2300 వరకు గత వారం కొనుగోలు చేసినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇక కడప, కర్నూలు నుంచి ఉల్లి రావడం పూర్తిగా ఆగిపోయింది. ఇక రిటైల్‌గా నాణ్యమైన ఉల్లి రూ.100కు 5కిలోలు, మధ్యస్త రకం ఉల్లి రూ.100కు 5కిలోలు, నాసిరకం ఉల్లి 100కు 6కిలోల వంతున విక్రయించారు.
నిలకడగా చికెన్ ధరలు
చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కార్తీక మాసంలో చికెన్ వినియోగం తక్కువగా ఉంటుంది. ఇదే అదునుగా చికెన్ సరఫరా చేసే కార్పొరేట్ సంస్థలు సరఫరా తగ్గించాయి. ఈమేరకు గత మూడు వారాలుగా చికెన్ ధర స్థిరంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.220, విత్‌స్కిన్ చికెన్ రూ.200కు విక్రయిస్తున్నారు.