Share News

వేగ జ్యూవెలర్స్‌ లక్కీ డ్రా విజేతలు వీరే..

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:28 AM

ఏలూరు వేగ జ్యూవెలర్స్‌ షోరూంలో మంగళ వారం నిర్వహించిన లక్కీ డ్రాలో ఒక్కొక్కరు రూ.2 లక్షల విలువైన డైమండ్‌ నెక్లస్‌లను ఐదుగురు గెలుచుకున్నారు.

వేగ జ్యూవెలర్స్‌ లక్కీ డ్రా విజేతలు వీరే..

ఏలూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి):ఏలూరు వేగ జ్యూవెలర్స్‌ షోరూంలో మంగళ వారం నిర్వహించిన లక్కీ డ్రాలో ఒక్కొక్కరు రూ.2 లక్షల విలువైన డైమండ్‌ నెక్లస్‌లను ఐదుగురు గెలుచుకున్నారు. వీరిలో ఏలూరుకు చెందిన టి.అరుణ శ్రీ, వి.రాంబాబు, గండికోట నాగలక్ష్మి, టి.శత్రుష్నుకుమార్‌, హనుమాన్‌జంక్షన్‌ కు చెందిన ఎ.శారదాదేవి ఉన్నారు. విజేతలను వేగ జ్యూవెలర్స్‌ చైర్మన్‌ బండ్లమూడి రామ్మోహన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వనమా నవీన్‌కుమార్‌, డైరెక్టర్లు వనమా సుధాకర్‌, చిట్టూరి నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. చైర్మన్‌, డైరెక్టర్లు మాట్లాడుతూ ఖాతాదారులకు లాభం చేకూరి, వారిని సంతృప్తి పర చాలనే లక్ష్యంతోనే ఆఫర్లను అందిస్తున్నామన్నారు. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రూ.100 అదనంగా చెల్లిస్తున్నట్టు తెలిపారు. డైమండ్‌ ధర క్యారెట్‌ కు రూ.51,999 అని తెలిపారు. ఈ ఆఫర్లు ఏలూరు షోరూమ్‌లో ఈనెల 25వరకు అందుబాటులో ఉంటాయన్నారు. వివాహా వేడుకల కోసం అన్ని రకాల ఆభరణాలను ఆఫర్లలో కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jul 09 , 2025 | 12:28 AM