Share News

వరాలివ్వు తల్లీ..

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:18 AM

వరలక్ష్మీ.. వరాలీయమ్మా అంటూ వ్రత దీక్షలో మహిళలు వేడుకున్నారు.

వరాలివ్వు తల్లీ..
సత్రంపాడు అంబికా ఆలయంలో వ్రతమాచరిస్తున్న మహిళలు

ద్వారకాతిరుమలలో సామూహిక వరలక్ష్మి వ్రతం

ద్వారకాతిరుమల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): వరలక్ష్మీ.. వరాలీయమ్మా అంటూ వ్రత దీక్షలో మహిళలు వేడుకున్నారు. చిన్న వెంకన్న ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను మహిళలు నిర్వహించారు. శ్రావణమాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని అనివేటి మండపంలో దాదాపు 3వేల మంది మహిళలు పూజల్లో పాల్గొన్నారు. ముందుగా వెండి తొళక్క వాహ నంపై వరలక్ష్మీ అమ్మవారిని అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ అనివేటి మండప వేదిక వద్దకు తెచ్చారు. అలంకరించిన వేదికపై అమ్మవారిని ఉంచి అర్చకులు హారతులు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ మహిళలు భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. వ్రతదీక్ష అనంతరం మహిళలకు అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, జాకెట్టు ముక్క, గాజులను పంపిణీ చేశారు. ఆలయ ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు

ఏలూరు కార్పొరేషన్‌: నగరంలోని అమ్మవారి ఆలయాల వద్ద మహిళలు విశేష పూజలు, సామూహిక వరలక్ష్మీవ్రతాలు చేశారు. ప్రత్యేక అలంకారంలో అమ్మవార్లు దర్శనమిచ్చారు. కుంకుమా ర్చనలు, సామూహిక పారాయణతో అమ్మవారి ఆలయాలు కిటకిటలా డాయి. సత్రంపాడు సౌభాగ్యలక్ష్మీదేవిని కొల్హాపూర్‌ మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. పట్టు చీరలతో అంబికాదేవి అమ్మవారిని అలంకరించారు. పత్తేబాదలోని కనకదుర్గమ్మకు లక్ష పంచ రంగుల గాజులు, బావిశెట్టివారి పేట కనకదుర్గాంబ గాజుల గౌరీదేవిగా అలంకరించారు. ఆలయాల మహిళలు సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలు నోచుకున్నారు.

Updated Date - Aug 23 , 2025 | 12:18 AM