Share News

వందేమాతర నినాదం.. ఓ శక్తి

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:29 AM

వందేమాతరం దేశ భక్తి యొక్క నినాదం మాత్రమే కాదు. అది మన మనసుల్లో దేశ మంటే ఏమిటో గుర్తు చేసే శక్తి’ అని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు.

వందేమాతర నినాదం.. ఓ శక్తి
భీమవరంలో వందేమాతరం ఆలపిస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు

భీమవరం టౌన్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి):‘వందేమాతరం దేశ భక్తి యొక్క నినాదం మాత్రమే కాదు. అది మన మనసుల్లో దేశ మంటే ఏమిటో గుర్తు చేసే శక్తి’ అని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సంద ర్భంగా శుక్రవారం భీమవరంలో వందేమాతర గీతాలాపన జరిగింది. బంకించంద్ర చటర్జీ రచించిన ఈ గేయం స్వాతంత్య్ర ఉద్యమకా రుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిందని పీఏసీ చైర్మన్‌, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, డీఈవో నారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.గీతా బాయి, పీఎస్‌ఎం బాలికోన్నత పాఠశాల విద్యా ర్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

క్యాన్సర్‌ అంటే భయం వద్దు

క్యాన్సర్‌ అంటే భయపడాల్సిన పనిలేదు. ముందుగా గుర్తిస్తే పూర్తి నయం చేయగల వ్యాధి. క్యాన్సర్‌పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పీఏసీ చైర్మన్‌, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయలు అన్నారు. జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం సందర్భంగా శుక్రవారం క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో కలిసి భీమవరంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ ముందస్తు క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు ద్వారా నూరు శాతం నిరోధించవచ్చని అన్నారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధి నుంచి కోలు కునే అవకాశం పెరుగుతుందన్నారు. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పాల్గొన్నారు.

బ్యాంకర్లు వెంటనే రుణాలు ఇవ్వాలి

పీఎం స్వ నిధి, వీవర్స్‌ ముద్ర, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు బ్యాంకర్లు వెంటనే రుణాలు మం జూరు చెయ్యాలని కలెక్టర్‌ నాగరాణి సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి బ్యాంకు మేనేజర్లు, బ్యాంక్‌ కంట్రోలర్స్‌, మెప్మా, డీఆర్‌డీఏ, వివిధ శాఖల అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పీఎం స్వనిధి కింద లబ్ధిదారులకు రుణాల మంజూ రు, నిధులు విడుదలలో కొన్ని బ్యాంకుల అధి కారులు తాత్సారం చేయడంపై కలెక్టర్‌ అసహ నం వ్యక్తం చేశారు. వీధి వ్యాపారుల రుణాలు మంజూరులో లబ్ధిదారుల సిబిల్‌ పరిశీలన మినహాయించి సొమ్ము విడుదల చేయాలన్నా రు. వీవర్స్‌ ముద్ర రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్దేశించిన లక్ష్యాలకు మించి రుణాలు అందజేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి బ్యాంకులు లబ్ధిదారులకు నూరు శాతం రుణాలు మంజూరు చేసి ప్రగతి చూపించాలన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నాగేంద్రప్రసాద్‌, మెప్మా పీడీ హెబ్సిబా, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 01:29 AM