Share News

నేటి నుంచి వాహన మిత్రకు దరఖాస్తు చేయొచ్చు

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:00 AM

ఆటో, క్యాబ్‌, టాక్సీ నడుపుతున్న యజమానులకు కూటమి ప్రభుత్వం వాహన మిత్ర ద్వారా రూ.15 వేలు లబ్ధి చేకూర్చేందుకు కసరత్తు చేప ట్టింది.

నేటి నుంచి వాహన మిత్రకు దరఖాస్తు చేయొచ్చు

జిల్లాలో 30 వేల మంది పైబడి అర్హత పొందే అవకాశం

కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌లో పేర్లు చూసుకోవాలని అధికారుల సూచన

అక్టోబర్‌ 2న ఆటో యజమానుల ఖాతాల్లో సొమ్ము జమ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఆటో, క్యాబ్‌, టాక్సీ నడుపుతున్న యజమానులకు కూటమి ప్రభుత్వం వాహన మిత్ర ద్వారా రూ.15 వేలు లబ్ధి చేకూర్చేందుకు కసరత్తు చేప ట్టింది. వాహనమిత్రకు అర్హులు బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవ చ్చని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణాల వలన తాము తీవ్రంగా నష్టపోయామని ఆటో యజమానులు, డ్రైవర్లు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఉపాధి పోయిందని, పూట గడవడం కష్టం మారిందని పలు చోట్ల ధర్నా చేశారు. వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరి శీలించిన టీడీపీ సర్కారు వారికి వాహనమిత్ర అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏటా పదివేల చొప్పున ఆటోవాలాలకు అందించిన ప్రభుత్వం టాక్స్‌ల రూపంలో అంతకంటే పెనుభారం మోపింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి కొన్ని విధాలా పన్ను రాయితీలను కూడా కల్పించింది. ఇటీవల గ్రామాలు, పట్టణాల్లో ఆటోల సంఖ్య పెరిగింది. యువత కూడా వీటి ఆసరాగానే ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఉపరవాణాశాఖ అధికారి (డీటీసీ) షేక్‌ కరీమ్‌ లెక్కల ప్రకారం జిల్లాలో లైసెన్సు పొందిన ఆటోలు రిజిస్ర్టేషన్లు 27వేలకు పైగా ఉండగా, క్యాబ్‌, టాక్సీలు కింద 3500 ఉన్నట్లు చెబు తున్నారు. దీంతో ఈ వాహనమిత్ర సాయం అందుకునే వారి సంఖ్య 30 వేలకు పైబడి ఉండవచ్చునని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, గతంలో పొందిన వారు అవ సరం లేదని చెబుతున్నప్పటికీ ఆన్‌లైన్‌లో వివరాలను చూసుకొని లేకపోతే దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసుకోవాల్సి ఉంటుంది.

24న తుది జాబితాలు..

వాహనమిత్రకు అర్హులు ఈ నెల 17 నుంచి 19 వరకు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. గతంలో లబ్ధి పొందిన వారు దరఖాస్తు చేయన వసరం లేదు. కొత్త వారి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, పాఠశాల సంక్షేమాధికారికి దరఖాస్తులను స్వీకరిస్తారు. 23 వరకు దరఖాస్తులను వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు పరిశీలించి, తుది జాబితాలను 24 సచివాలయాల వద్ద ఉంచుతారు.

ఇవి కావాలి..

దరఖాస్తుదారుకు విధిగా ఆధార్‌ లింక్డ్‌ బ్యాంక్‌ ఖాతా ఉండాలి. పాత లబ్ధిదారుల పేర్లు 12 నుంచి ఆటోమేటిక్‌గా సచివాలయానికి వెరిఫికేషన్‌కు వస్తారు. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులు కలిగి ఉండి, సొంత ఆటో లేదా, టాక్సీ, క్యాబ్‌ ఉండాలి. ఒరిజనల్‌ ఆర్‌సీ తన పేరు మీద ఉండాలి. ట్రాన్స్‌ఫోర్టు వెహికల్‌ అయ్యి ఉండాలి. ఎల్లో నెంబర్‌ ప్లేట్‌ ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండి, సంబంఽధిత వాహనం వెహికల్‌ రిజిస్ర్టేషన్‌ చిరునామా రాష్ట్రంలో ఉండాలి. బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం పూర్తి వివరాలను దరఖాస్తులో పేర్కొనాలి.

Updated Date - Sep 17 , 2025 | 12:00 AM