నేటి యువతకు ‘ఉయ్యాలవాడ’ స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:22 AM
స్వాతంత్య్ర సమర యోఽథు డు, విప్లవ వీరు డు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి విగ్రహా విష్కరణ నేటి యువతకు స్ఫూర్తి దాయకమని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి
పెనుమంట్ర, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమర యోఽథు డు, విప్లవ వీరు డు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి విగ్రహా విష్కరణ నేటి యువతకు స్ఫూర్తి దాయకమని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. పెనుమంట్ర మండలం మార్టేరులో ఆదివారం ఉదయం నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధనలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి వందేళ్ల పూర్వమే బ్రిటీష్ వారిపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఉయ్యాలవాడ అన్నారు. జిల్లా రెడ్డి సేవా సంఘం నాయకులు కేవీవీ సత్యనారాయణరెడ్డి, వెలగల బుల్లిరామిరెడ్డి, కోనాల కోదండచంద్ర శేఖరరెడ్డి, తేతలి రాజారెడ్డి, గుడిమెట్ల లక్ష్మణ్‌రెడ్డి, నల్లిమిల్లి వివేకానందరెడ్డి పాల్గొన్నారు.