Share News

7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:57 PM

ప్రసిద్ధ క్షేత్రం ద్వారకాతిరుమలలో వేంకటేశ్వర స్వామి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 7నుంచి 14 వరకు నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్‌వీ.సత్యనారాయణమూర్తి తెలిపారు.

7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

11న తిరు కల్యాణ మహోత్సవం

12న రథోత్సవం

7 నుంచి 14 వరకు ఆర్జిత సేవలు రద్దు

ద్వారకాతిరుమల, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ క్షేత్రం ద్వారకాతిరుమలలో వేంకటేశ్వర స్వామి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 7నుంచి 14 వరకు నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్‌వీ.సత్యనారాయణమూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో నిత్యార్జిత కల్యాణాలను, ఆర్జిత సేవల ను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7న ఉదయం స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరిస్తారు. 8న ధ్వజారో హణ, 10న ఎదుర్కోలు ఉత్సవం, 11న శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. 12న రఽథోత్సవం, 13న శ్రీచక్రవార్యుత్సవం, ద్వజావరో హణ, 14న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్స వం, ద్వాదశ కోవెల ప్రదక్షిణ, శ్రీపుష్పయా గోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

Updated Date - Apr 16 , 2025 | 11:57 PM