కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ధర్నా
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:39 AM
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని విద్యా హక్కు చట్టం సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వ హించారు.
ఏలూరు రూరల్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని విద్యా హక్కు చట్టం సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వ హించారు. జిల్లా అధ్యక్షులు బొర్రా సుభాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి మాట్లా డుతూ పదో తరగతి పరీక్షార్థుల కోసం విద్యాశాఖ అమలు చేస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆదివారాలు, సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక తరగతుల బాల బాలికల కోసం చేపట్టిన 75 రోజుల జీఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రాం అమలులో విద్యార్థులకు స్వేచ్ఛగా వారికి రాని అంశాలను టీచర్లు నేర్పించే వెసులుబాటు కల్పించాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల టీచర్లు సాధారణ, ఐచ్చిక సెలవులను వినియోగించుకునే విషయంలో సాంకేతిక ఇబ్బందు లను తొలగించాలన్నారు. ఎంఈవోలు మహిళా ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరి చేసుకోవాల న్నారు. గౌరవాధ్యక్షులు శ్యాంబాబు, ఎస్.సుధారాణి, జీవీ రంగ మోహన్, ముస్తఫా ఆలీ, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షప్రధాన కార్యదర్శులు యూటీఎఫ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.