యువతకు నైపుణ్యం అవసరం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:24 AM
యువత నైపుణ్యం అవసరమని, నైపుణ్యాభివృద్ధి కోర్సులు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తిగత కార్యదర్శి పి.అనిరుధ్ అన్నారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామంలో
వ్యక్తిగత కార్యదర్శి అనిరుధ్ పర్యటన
నరసాపురం రూరల్, జూలై 5(ఆంధ్రజ్యోతి): యువత నైపుణ్యం అవసరమని, నైపుణ్యాభివృద్ధి కోర్సులు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తిగత కార్యదర్శి పి.అనిరుధ్ అన్నారు. నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పీఎంలంకలో శనివారం ఆయన పర్యటిం చారు. ప్రభుత్వ విప్ నాయకర్, కలెక్టర్ నాగరాణితో కలిసి గ్రామంలోని డిజిటల్ భవనాన్ని సందర్శించారు. యువతకు ఇస్తున్న శిక్షణ గురించి ఆరా తీశారు. అనంతరం యువతతో మాట్లాడి స్కిల్స్ డవలప్‌మెంట్ కోర్సులకు మంచి భవిష్యత్ ఉందని సూచించారు. అనంతరం సముద్ర కోత ప్రాంతం లో రూ.13.50 కోట్లతో చేపట్టిన గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. డిలైట్, పూనె సంస్థల ప్రతినిధులు నిర్మాణ పనులు అనిరుధ్‌కు వివరించా రు. అనంతరం ఆయన ఆధికారులతో సమావేశమయ్యారు. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ అందజేసిన రూ 2.50 కోట్లతో జరుగుతున్న గ్రామాభివృద్ధి పనుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. విప్ నాయకర్ మాట్లాడుతూ మారుమూల పీఎంలంక గ్రామాన్ని దత్తత తీసుకుని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడు తూ డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి వ్యక్తిగత సహాయకుడు విష్ణుసింగ్, ఆర్డీవో దాసిరాజు, ఇరిగేషన్ ఎస్‌ఈ నాగార్జున, ఈఈ సత్యనారాయణ, ఎస్‌ఈ రఘునాథ్‌బాబు పాల్గొన్నారు.