Share News

ఒంటరి వృద్ధులే లక్ష్యంగా..

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:09 AM

ఒంటరిగా ఉన్న వృద్ధులే ఆ ముఠాకు టార్గెట్‌. దాడులకు తెగబడి బంగారాన్ని అపహరించే ముఠాను కైకలూరు రూరల్‌ పోలీసులు అరెస్టు చేసినుట్ల ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ తెలిపారు.

ఒంటరి వృద్ధులే లక్ష్యంగా..
పోలీసుల అదుపులో నిందితులు, కేసు వివరాలు చెబుతున్న ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

ఏలూరు క్రైం, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఒంటరిగా ఉన్న వృద్ధులే ఆ ముఠాకు టార్గెట్‌. దాడులకు తెగబడి బంగారాన్ని అపహరించే ముఠాను కైకలూరు రూరల్‌ పోలీసులు అరెస్టు చేసినుట్ల ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ముఠా వివరాలను వెల్లడించారు. కైకలూరు రూరల్‌ మండలం రాయవరంలో మే 28న ఒంటరిగా ఉంటున్న గూడూరి నాగలక్ష్మి (62) వద్దకు ఇద్దరు యువకులు వెళ్లి ఆమె తల ను గోడకేసి కొట్టి గాయపరిచారు. స్పృహ తప్పి న ఆమె మెడలో బంగారు చైన్‌, గాజులు అపహరించుకుపోయారు. పోలీసులు బృందాలు గా ఏర్పడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నేరాలకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన పంతగాని జాన్‌కుమార్‌, గరికముక్కు రాజ్‌ కుమార్‌ను అరెస్టు చేసి వారి నుంచి చోరీకి గురైన ఆభరణాలు స్వాధీనం చేసుకన్నారు.

రాయవరం గ్రామానికి చెందిన సోము సీతామహలక్ష్మి (65) కిరాణా కొట్టు నిర్వహిస్తుం ది. 2024 ఫిబ్రవరి 13న నలుగురు దొంగలు ఆమెపై దాడి చేసి రెండు బంగారు గాజులు అపహరించుకుపోయారు. అదే గ్రామానికి చెం దిన భూపతి ప్రదీప్‌ అలియాస్‌ బన్ను, కురేళ్ల సుబ్బారావు అలియాస్‌ సుబ్బును అరెస్టు చేసి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.

వైద్యుని ఇంట్లో చోరీ

ఒక వైద్యుడు ప్లాటుకు తాళం వేసి డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి దొంగలు బంగారు ఆభర ణాలు, వజ్రాలను అపహరించారు. దాసరి లోకనాఽథం (69) ఆశ్రం ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య చీరాల బంధువుల ఇంటికి వెళ్లారు. పనిమనిషి వచ్చి ఇంటి తాళం తీసి పనిచేసుకుని వెళ్లిపోతుందని ప్లాట్‌కు తాళం వేసి తాళాన్ని పక్కనే పెట్టారు. పనిమనిషి ప్రతి రోజు పనిచేసి తాళం అక్కడ పెట్టి వెళ్లిపోతుంది. ఈనెల 3న డాక్టర్‌ లోక నాథం ఉదయం 9 గంటలకు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి తాళం చెవి కనిపించలేదు. అక్కడ ఉన్న వారి సహకారంతో తాళం పగులగొట్టారు. లోపల బీరువా పగులగొట్టి, ఇంట్లో వస్తువులు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. బీరువాలోని 70 కాసుల బంగారు ఆభరణాలు, వజ్రాల హారం, కొన్ని వజ్రాలు అపహరించినట్లు గుర్తించారు. వెండి వస్తువులు, నగదు, బంగారు బిస్కెట్లు బీరువాలోనే ఉన్నాయి. దొంగ యధావిధిగా ఇం టికి తాళం వేసి తాళం చెవి పట్టుకుపోయాడు. డాక్టర్‌ ఫిర్యాదుతో శుక్రవారం ఏలూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్‌ సీఐ జి.సత్యనారాయణ సిబ్బందితో సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్స్‌తో పరిశీలన చేయించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jul 05 , 2025 | 01:09 AM