Share News

ఎదురొచ్చిన మృత్యువు

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:28 AM

ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద గురు వారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని పాలవ్యాన్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

ఎదురొచ్చిన మృత్యువు

ఆగిరిపల్లి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద గురు వారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని పాలవ్యాన్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నూజివీడుకు చెందిన బగోతు కోటేశ్వరరావు (38) స్థానికంగా సెల్‌ఫోన్ల సామగ్రికి సంబం ధించి చిన్నపాటి దుకాణం నిర్వహిస్తున్నాడు. సామగ్రి తెచ్చేందుకు గురువారం అతనితో పాటు నూజివీడుకు చెందిన దొడ్డపనేని రామ కృష్ణ(60) ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్లారు. పని ముగించుకుని తిరిగి రాత్రి ఆగిరి పల్లి మీదుగా నూజివీడు వస్తుండగా 11:30 గంటల ప్రాంతంలో మార్గమధ్యలోని వడ్లమా ను వద్ద గల చప్టా వద్ద ఎదురుగా అతివేగం గా వచ్చిన పాల వ్యాన్‌ ఢీకొట్టింది. రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ శుభశేఖర్‌ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కోటేశ్వర రావును అంబులెన్స్‌లో నూజివీడు ఏరియా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యాను డ్రైవర్‌ ఏలూరుకు చెందిన కఠారి మణికంఠ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కోటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా రామకృష్ణకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శవపంచనామా అనంత రం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Nov 15 , 2025 | 12:28 AM