Share News

గిరిజనాభివృద్ధి

ABN , Publish Date - May 26 , 2025 | 12:21 AM

గిరిజనాభివృద్థికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ధర్తీ ఆబా జన్‌ జాతీయ గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌–2025 పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

గిరిజనాభివృద్ధి

ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్‌

ఉత్కర్ష్‌ అభియాన్‌పై కలెక్టర్‌ సమీక్ష

ఏలూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): గిరిజనాభివృద్థికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ధర్తీ ఆబా జన్‌ జాతీయ గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌–2025 పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఉత్కర్ష్‌ అభయాన్‌–2025 పథకం అమలుపై ఆదివారం అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. గిరిజనుల సాధికారత, ఆర్థిక, సామాజికాభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈ కార్యక్రమంపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. జూన్‌ 15 నుంచి 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహించాల న్నారు. గిరిజనులకు గృహాలు, రోడ్లు, తాగునీటి సౌకర్యా లపై నుంచి వినతులు తీసుకోవాలన్నారు. ఉపాధి అవ కాశాలు కల్పించడం, ఆధార్‌ కార్డులు, జన్‌ధన్‌ ఖాతా, కుల ధ్రువీకరణ పత్రాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - May 26 , 2025 | 12:21 AM