వృక్ష విలాపం!
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:56 PM
గోదావరి కాల్వ పటిష్టతను దెబ్బతీసేలా కిందిస్థాయి సిబ్బందే కాల్వ గట్లపైన ఉన్న చెట్లను నరికించి వేస్తూ ఆదాయ వన రులుగా మార్చుకు న్నారనే అరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా గోదావరి కాల్వ గట్టుపై చెట్ల నరికివేత
అధికారులకు ఫిర్యాదు చేసిన గోదావరి కాల్వ డీసీ చైర్మన్
దెందులూరు,డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): గోదావరి కాల్వ పటిష్టతను దెబ్బతీసేలా కిందిస్థాయి సిబ్బందే కాల్వ గట్లపైన ఉన్న చెట్లను నరికించి వేస్తూ ఆదాయ వన రులుగా మార్చుకు న్నారనే అరోపణలు వినిపిస్తున్నాయి. కొవ్వలి నుంచి సత్య నారాయణపురం వరకు రెండు కిలోమీటర్ల మేర గోదావరి కాల్వ గట్టుపై ఉన్న పెద్ద చెట్లను ఇరిగేషన్ కిందిస్థాయి ఉద్యోగి సహకారంతో కొందరు నరికి అమ్మేసుకుంటు న్నారు. శనివారం పెద్ద మొత్తంలో చెట్లను నరికి తరలిస్తుండగా కొవ్వలి మాజీ సర్పంచ్, గోదావరి కాల్వ డీసీ చైర్మన్ వెలమాటి రాంబాబు జిల్లా అధికారులకు, అటవీశాఖ అఽధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది గమనించి నరికిన చెట్లను అక్కడే వదిలి కూలీలు ఉడాయించారు. అయితే కరెంట్ వైర్లకు చెట్ల కొమ్మలు తగుతున్నాయని అందుకే నరికిస్తు న్నట్టు ఆ ఉద్యోగి కప్పిపుచ్చే ప్రయత్నం చేశా డు. అసలు కరెంట్ స్తంభాలకు సంబంధం లేని గోదావరి కాల్వ పక్కనున్న చెట్లను నరికి అమ్మేసుకుంటున్న ఆ ఇరిగేష న్ ఉద్యోగిపై చర్య తీసుకోవాలని రైతులు, గోదావరి కాల్వ సంరక్షణ డీసీ చైర్మన్ రాంబాబు కోరుతున్నారు. కాల్వ గట్ల మీద ఉన్న చెట్లను తొలగించాలంటే బహి రంగ టెండర్ పిలిచి అప్పుడు తొలగించాలి. ఆ మేరకు వచ్చిన సొమ్మును ఉన్నతాధికారి పేరు మీద జమ చేయాలి. కానీ ఇక్కడ కొన్నేళ్లుగా నిబంధనలు పాటించడం లేదు. ఈ విషయాలన్నీ తెలిసినా ఇరిగేషన్, అటవీ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.