అధికారులు కావలెను!
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:47 AM
జిల్లాల విభజన నేపథ్యంలో వివిధ శాఖల్లో సూపరింటెండెంట్, ఇతర కీలక అధికారులను పొరుగు జిల్లాలకు సాగనంపినా.. తాజా బదిలీల్లో భర్తీ కాలేదు.

భర్తీ కానీ కీలక పోస్టులు
బదిలీలపై ఆశలన్నీ ఆవిరి
జిల్లా సహకార అధికారి పోస్టు ఖాళీ
రెవెన్యూ, పరిశ్రమలు, దేవదాయ శాఖల్లో ఖాళీలు అనేకం
జిల్లాల విభజన నేపథ్యంలో వివిధ శాఖల్లో సూపరింటెండెంట్, ఇతర కీలక అధికారులను పొరుగు జిల్లాలకు సాగనంపినా.. తాజా బదిలీల్లో భర్తీ కాలేదు. దాదాపు మూడేళ్ల నుంచి విధుల్లో ఉన్న అధికారులు, ఇతర సిబ్బందిపై భారం పడింది. బదిలీల్లో కీలక పోస్టులు భర్తీ చేయడం ద్వారా తమపై ఒత్తిడి తగ్గిస్తారని ఎదురు చూసినా చివరకు నిరాశే మిగిలింది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ శాఖల్లో ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసిన వారు, మూడేళ్లు దాటిన వారికి గత నెల 16 నుంచి ఈ నెల 9 వరకు బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏలూరు జిల్లా నుంచి కొంత మంది అధికారులు వెళ్లడం తప్ప, ఆయా స్థానాల్లో ఎవరూ నియమితులు కాలేదు. వివిధ కార్యాల యాల్లో అధికారులు, సిబ్బందిని కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు పంపించారు. ఇక్కడ అవరమైన పోస్టులు భర్తీ కాకపోవడం తో ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది.
ఇన్‌చార్జిలతో సరి..!
జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జేడీ జయప్రకాష్ బదిలీలకు ముందే రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిపోగా, ఆయన స్థానంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో పది మందికి పైగా తహసీల్దా ర్లు, 14 మంది డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌చార్జులే కొనసాగు తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు తహసీల్దార్‌గా డిప్యూ టీ తహసీల్దార్ గాయత్రికి ఇన్‌చార్జిగా పూర్తి అదనపు బాఽధ్య తలు అప్పగించారు. జిల్లా పరిశ్రమల కేంద్రంలో సిబ్బంది కొరతతో జీఎం ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. సూపరింటెం డెంట్, క్లస్టర్ ఇన్‌చార్జులు, డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. కీలకమైన సహకారశాఖాధికారి పోస్టు కూడా మళ్లీ ఖాళీ అయింది. జిల్లా ఆడిట్ అధికారిగా ఉన్న ఆరిమి ల్లి శ్రీనివాస్ ఇన్‌చార్జి డీసీవోగా వ్యవహరించారు. ఆయన భీమవరం డివిజనల్ రిజిస్ర్టార్‌గా బదిలీ కావడంతో ఎవరికీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించలేదు. సీనియర్ అయిన నూజివీడు డివిజనల్ రిజిస్ర్టార్ రవికుమార్‌కు అప్పగిస్తా రని సమాచారం. 747 దేవాలయాలు పర్యవేక్షించాల్సిన దేవదాయశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ పోస్టుతో పాటు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కొరత ఉంది. దేవదాయశాఖ ఏసీ సీహెచ్ రంరారావు బదిలీ కావడంతో కొల్లేటి కోట పెద్దింటమ్మ గుడి ఈవో కూచిపూడి శ్రీనివాస్‌కు పూర్తి అదనపు బాఽధ్యతలు అప్పగించారు. గనులశాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్, ఒక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు భర్తీకాలేదు.
ఆర్ అండ్ బీలో ఇంజనీర్లు కొరత
ఉమ్మడి జిల్లా ఆర్‌అండ్‌బి సర్కిల్‌లో 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. రహదారులు, ఇతర అంచనాల రూపొందించడం కష్టతరం గా మారింది. కనీసం సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీ రింగ్ అసిస్టెంట్లను అయినా తమకు కేటాయించాలని ఆర్ అండ్ బీ ఎస్‌ఈ కలెక్టర్‌కు ఇటీవల రాతపూర్వకంగా కోరి నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం, ఆయశాఖల ఉన్నతా ధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది.