Share News

శిక్షణ సరే.. కుట్టు మిషన్లు ఎక్కడ?

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:26 AM

పట్టణ, గ్రామీణ మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పా టుచేసిన టైలరింగ్‌ కుట్టు శిక్షణలు ముగిశా యి. శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా అందిస్తామన్న టైలరింగ్‌ మిషన్లే ఊసే లేదు.

శిక్షణ సరే.. కుట్టు మిషన్లు ఎక్కడ?
కుట్టు శిక్షణ

శిక్షణ సరే.. కుట్టు మిషన్లు ఎక్కడ?

ఉమ్మడి జిల్లాలో 3,500 మంది ఎదురుచూపులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

పట్టణ, గ్రామీణ మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పా టుచేసిన టైలరింగ్‌ కుట్టు శిక్షణలు ముగిశా యి. శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా అందిస్తామన్న టైలరింగ్‌ మిషన్లే ఊసే లేదు. రెండో విడతలో శిక్షణ పొందడానికి బ్యాచ్‌లకు రెడీ అవుతున్న తరుణంలో మిషన్ల జాడ లేక పోవడంతో బీసీ కార్పొరేషన్‌లో స్తబ్థత నెలకొంది. శాఖాపరంగా లబ్ధిదారులకు యూని ట్ల మంజూరు నిలిచింది. ఆదరణ–3 పథకం ఇంకా కొలిక్కి రాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక జిల్లావ్యాప్తంగా టైలరింగ్‌ శిక్షణ అవసరాలను గుర్తించి ఉమ్మడి జిల్లాలో ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలు 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి ఉచిత శిక్షణను ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించారు. సెప్టెంబరు నాటికి 80 శాతం శిక్షణలు పూర్తయ్యాయి. గత నెలలో కొన్ని సెంటర్లలో శిక్షణలను పూర్తిచేశారు.

సర్టిఫికెట్లు జారీ.. మిషన్లు ఎప్పుడో..

శిక్షణకు మహిళల ఎంపిక పారదర్శకంగానే చేపట్టారు. మూడు నెలలు కాలంలో 75 శాతం అటెండెన్సీ ఉంటేనే సర్టిఫికెట్‌ ఇస్తామని నిబంధన పెట్టారు. వీరికి ముఖ అధారిత హాజరును పరిగణనలోకి తీసుకున్నారు. మహి ళలకు వెసులుబాటు ప్రకారం ఉదయం తొమ్మిది, మధ్యాహ్నం రెండు దాటాక శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 36 బ్యాచ్‌ల కింద 3,500 మందికి శిక్షణ పూర్తిచేస్తారు. వాస్తవం గా 65 సెంటర్ల ద్వారా ఏడు వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యం కాగా.. ఉన్నంతలో వేగంగా లబ్ధిదారులను ఎంపిక చేసి శిక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలి. మరోవైపు ఉత్తమంగా ప్రతిభ చాటిన వారికి ఫ్యాషన్‌ డిజైన్ల కోర్సుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం యోచించింది. మిషన్లు పంపిణీ లేకపోవడంతో లబ్ధిదారులు అధికారులను నిలదీస్తున్నారు.

ఎందుకో ఈ జాప్యం?

ఒక్కొక్కరికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు, ట్రైనీల పేరిట ఒక్కొక్కరికి రూ.21 వేలు గరి ష్టంగా ఖర్చు పెట్టారు. మిషన్లు కొనుగోలుకు ఇంకా టెండర్లు పిలవలేదా ? లేదా రాష్ట్ర వాప్తంగా శిక్షణలు పూర్తికాలేదా? అంటే అధి కారుల వద్ద సమాచారం లేకుండా ఉంది. కుట్టు శిక్షణలు నేర్చుకొని ఖాళీగా కూర్చొవా లా ? అంటూ మహిళలు నిట్టూర్చుతున్నా రు. నేర్చుకున్నది మర్చిపోతామన్న ఆందోళ న వ్యక్తమవుతోంది. ఈ విషయమై బీసీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌.పుష్ప లత సంప్రదించగా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మాకు తెలియదు. శిక్షణలు పూర్తిచేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము నడుచుకుంటామన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:26 AM