Share News

విత్తన సాగులో టాప్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:24 AM

రబీలో ఏలూరు జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న విత్తన ఉత్పత్తి సాగు అవుతున్నది. జిల్లాలో మొక్కజొన్న విత్తన సాగు సాధారణ విస్తీర్ణం 75 వేలు ఎకరాలు కాగా ఏటా జిల్లాలో 53 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న విత్తనం సాగు అవుతోంది.

విత్తన సాగులో టాప్‌

విత్తన సాగులో టాప్‌

దేశంలోనే మొక్కజొన్న విత్తనాల ఉత్పత్తిలో ఏలూరు జిల్లాకు గుర్తింపు

కొనుగోలుకు మల్టీ నేషనల్‌ కంపెనీలు

విదేశాలకు సైతం ఎగుమతులు

బేబీకార్న్‌, పాప్‌ కార్న్‌, స్వీట్‌ కార్న్‌ ఉత్పత్తి కూడా ఇక్కడే..

రబీలో ఏలూరు జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న విత్తన ఉత్పత్తి సాగు అవుతున్నది. జిల్లాలో మొక్కజొన్న విత్తన సాగు సాధారణ విస్తీర్ణం 75 వేలు ఎకరాలు కాగా ఏటా జిల్లాలో 53 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న విత్తనం సాగు అవుతోంది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొక్కజొన్న విత్తనాల్లో 70 శాతం విత్తనాలు జిల్లా నుంచే ఉత్పత్తి అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో సంకరజాతి విత్తనాలను ఉత్పత్తి చేయడం విశేషం. మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసేందుకు 25 నుంచి 30 మల్టీ నేషనల్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. విత్తనాలు క్వింటా రూ.4వేలు ఉండగా, వాణిజ్యపరంగా అమ్ముకునే మొక్కజొన్న క్వింటా రూ.2200 ధర ఉన్నది.

ఏలూరుసిటీ, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఏ లూరు జిల్లాలో పామాయిల్‌ తర్వాత మొక్కజొన్న విత్తన సాగు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. పెదవేగి, చింతలపూడి, లింగపాలెం, నూజివీడు, ముసునూరు, చాట్రాయి, జంగారెడ్డిగూడెం, టి.నరసాపు రం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, కామవరపుకోట, బుట్టాయిగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో ఈ మొక్కజొన్న విత్తన ఉత్పత్తి జరుగుతోంది. ఆదాయ పంటగా మొక్కజొన్న ఉండడంతో సాగుపై రైతులు మొగ్గుచూపుతున్నారు. మరో విశేషమేమిటంటే ఈ జిల్లాలోనే బేబీకార్న్‌, పాప్‌కార్న్‌, స్వీట్‌ కార్న్‌కు విని యోగించే మొక్కజొన్న విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు.

30వేల ఎకరాల్లో మొక్కజొన్న విత్తన సాగు

జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌కు సంబంధించి ఇప్ప టికే 30వేల ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాన్ని సాగు చేశారు. అధిక ఆదాయానిచ్చే పంట కావటంతో మొక్క జొన్న విత్తన సాగు జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది.

అధిక ఆదాయానిచ్చే విత్తన సాగు

మొక్కజొన్న విత్తన సాగులో అధిక ఆదాయం లభిస్తుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారుల నివేదిక లు చెబుతున్నాయి. ఎకరానికి 4టన్నుల మొక్కజొన్న విత్తనాలు ఉత్పత్తి అవుతాయని, టన్నుకు 30 వూల నుంచి 40 వేల రూపాయలు ధర పలుకుతుందని చెబుతున్నారు. కనీసం టన్నుకు 30వేల రూపాయలు ధర లభించినా ఎకరానికి లక్షా 20వేల రూపాయలు ఆదాయం లభిస్తుందని, సాగు ఖర్చులు 40వేలు రూ పాయలు అవుతాయని, రైతులకు ఎకరానికి 80వేల రూపాయలు నికర ఆదాయం ఈ పంట సాగు ద్వారా లభిస్తుందని జిల్వా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒక వేళ కౌలు సాగులో అయినా 30 వేల రూపాయలు కౌలు తీసి ఆదాయాన్ని లెక్కిస్తే ఎక రానికి 50వేల రూపాయలు వరకు రైతుకు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఆదాయం అం తా వాతావరణం అనుకూలంగా ఉండి, అనుకున్న విధ ంగా దిగుబడి జరిగితేనే అధిక ఆదాయం లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

కొనుగోలుకు మల్టీనేషనల్‌ కంపెనీలు

ఇక్కడ ఉత్పత్తి అయ్యే మొక్కజొన్న విత్తనం కొను గోలు చేసేందుకు 25 నుంచి 30 మల్టీనేషనల్‌ కంపె నీలు ఏలూరు జిల్లాలోనే ఉన్నాయని చెబుతున్నారు. అదీ కాకుండా కొరియాకు చెందిన కంపెనీ సిపిసీడ్స్‌ ఇక్కడే ఉందని, ఆ కంపెనీ 40 దేశాలకు ఇక్కడ ఉత్ప త్తి అయ్యే మొక్కజొన్న విత్తనాలను ఎగుమతి చేస్తుం దని కూడా చెబుతున్నారు. స్వదేశీ కంపెనీలైన నూజి వీడు సీడ్స్‌, కావేరి సీడ్స్‌, పయనీర్‌ సీడ్స్‌ తదితర అనేక కంపెనీలు ఏలూరు జిల్లాలో విత్తన ఉత్పత్తి విస్తరించ టంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. రైతులతో అగ్రిమెంట్లు చేసుకుని విత్తనా లు కొనుగోలు చేస్తున్నా యి. ఇదిలా ఉండగా ఇక్కడ ఉత్పత్తి చేసే మొక్కజొ న్నను డ్రై చేయటానికి వీలుగా జిల్లాలో 40 నుంచి 50 డ్రయర్లు వరకు ఉన్నాయని చె బుతున్నారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా గాని, పరోక్ష ంగాగాని వేలమందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పవచ్చు.

విత్తనాల సాగులో ఇబ్బందులు

మొక్కజొన్న విత్తనాలు సాగులో కంపెనీలు ఇచ్చిన విత్తనాలనే రైతులు సాగు చేయటం జరుగుతున్నది. ఒక్కో సారి కంపెనీలు చెప్పిన విధంగా విత్తన సాగు చేసినా అనుకూల ఫలితాలు రాకపోతే రైతులు నష్ట పోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా మధ్య వర్తుల వల్ల ఎక్కువగా నష్టాలు చవి చూస్తున్నామని రైతులు అంటున్నారు. మంచి విత్తనాలను ఎంచుకుని సాగు చేసుకుంటే మంచి ఫలితాలే వస్తాయని చెబుతున్నారు.

మేలు రకమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలి

మొక్కజొన్న విత్తనోత్పత్లిలో జిల్లా దేశంలోనే ప్రము ఖ స్థానాన్ని ఆర్జించింది. మొక్కజొన్న సాగు చేసే రైతులను విత్తన కంపెనీల ఆర్గనైజర్లు ఎటువంటి ఇబ్బ ందులకు గురిచేయవద్దు. మేలుకరమైన విత్తనాలను రైతులకు ఇవ్వటంతో పాటు ధర చెల్లింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా సహించేది లేదు. రైతులు ముందస్తు అగ్రిమెంట్లు కంపెనీలు నుంచి పొందిన తర్వాతే మొక్కజొన్న విత్తనసాగు చేయాలి.

– హబీబ్‌ బాషా,

ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ

Updated Date - Dec 23 , 2025 | 12:24 AM