రేపు సహకారం బంద్
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:50 AM
సహ కార సంఘాల ఉద్యోగులు ఉద్యమబాట పట్టనున్నారు. పెం డింగ్‌లో వున్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఒక రోజు ఆందో ళన పట్టనున్నారు.
తమ డిమాండ్ల పరిష్కారించాలంటూ
‘ఛలో విజయవాడ’ ఉద్యోగుల ఆందోళన
విజయవాడ అప్కాబ్ కార్యాలయం వద్ద ధర్నా
నరసాపురం రూరల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి):సహ కార సంఘాల ఉద్యోగులు ఉద్యమబాట పట్టనున్నారు. పెం డింగ్‌లో వున్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఒక రోజు ఆందో ళన పట్టనున్నారు. ఆ రోజు జిల్లావ్యాప్తంగా వున్న సహకార సంఘాలను బంద్ చేసి, విజయవాడ ఆప్కాబ్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నారు. దీనికి జిల్లాలోని 254 సొసైటీలకు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది హాజరు కానున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఉద్యోగులు సమావేశాలు నిర్వహించి, చలో విజయవాడకు పిలుపునిచ్చారు. రైతులకు మెరుగైన సేవలందించడంతోపాటు సొసైటీల అఽభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. అయినప్పటికీ తమ సమస్యలు తీరడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పది నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఒక రోజు ధర్నాకు సమాయత్తం అవుతున్నారు.